Kalki 2898 AD : వీడిన కల్కి రిలీజ్ డేట్ మిస్టరీ… ఈ డేట్ ఎందుకు స్పెషల్ అంటే?

Kalki 2898 AD : ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈరోజు థియేటర్లోకి వచ్చిన కల్కి మూవీ గురించే చర్చ నడుస్తోంది. ఓవరాల్ గా మూవీ బాగుంది అంటూ పాజిటివ్ టాక్ నడుస్తోంది. అయితే అంతా బాగుంది గాని కల్కి మూవీని ఫిలిం ఇండస్ట్రీ ఆనవాయితీగా భావించే శుక్రవారం కాకుండా గురువారం రోజు ఎందుకు రిలీజ్ చేశారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే దీని వెనక ఉన్న రీజన్ ఏంటో తాజాగా బయటకు వచ్చింది.

వీడిన కల్కి రిలీజ్ డేట్ మిస్టరీ…

సినిమా ఇండస్ట్రీలో శుక్రవారం అనేది సెంటిమెంట్. థియేటర్లలో కొత్త సినిమాలను రిలీజ్ చేయడానికి శుక్రవారం బెస్ట్ ఆప్షన్ అని నిర్మాతలు నమ్ముతారు. గతంలో శుక్రవారం రిలీజ్ అయిన కొన్ని సినిమాలు చరిత్రను క్రియేట్ చేయడంతో దాన్నే సెంటిమెంట్ గా ఫాలో అవుతున్నారు. పైగా శుక్రవారం రిలీజ్ చేస్తే ఆ వెంటనే వీకెండ్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచన కూడా ఉంది. ఇక మరికొన్ని సినిమాల విషయంలో మాత్రం ఈ శుక్రవారం సెంటిమెంట్ మారుతూ ఉంటుంది. పండగలు, హాలిడేస్ ఉన్నప్పుడు మిగతా రోజుల్లో కూడా సినిమాలను తెరపైకి తీసుకొస్తారు. కానీ ఎలాంటి కారణం లేకుండా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 మూవీనీ గురువారం రిలీజ్ చేశారు. దీంతో మేకర్స్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఒకరోజు ముందుగా రిలీజ్ చేస్తే వీకెండ్ తో కలుపుకొని భారీ కలెక్షన్లు వస్తాయి అనే ఆలోచనతో ఇలా చేశారా? అని అనుకుంటున్నారు. ఒకరకంగా ఇది కరెక్టే అయినప్పటికీ సాటిస్ఫైడ్ ఆన్సర్ మాత్రం కాదు.

Kalki 2898 AD Box Office Advance Booking (North America): Breaches $1 Million Mark; Is This The Biggest Indian Film Premiere Ever In The US & Canada?

- Advertisement -

రిలీజ్ డేట్ వెనుక ఇంత పెద్ద స్టోరీనా ?

అయితే దీని వెనక ఓ ప్రత్యేకమైన స్టోరీ ఉన్నట్టుగా తెలుస్తోంది. పలు తెలుగు క్యాలెండర్ తో పాటు మహాభారతానికి కూడా లింక్ ఉన్నట్టుగా సమాచారం. ఇక అసలు విషయంలోకి వెళ్తే ముందుగా న్యూమరాలజీనీ పరిగణలోకి తీసుకోవాలి. కల్కి సినిమా టైటిల్ లో ఉన్న 2898 ఏడి మొత్తంగా కలిపితే 27 అనే సంఖ్య వస్తుంది. ఇది రిలీజ్ డేట్ తో సరిపోతుంది. మరి జూన్ నెలనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే దాని వెనక ఇంట్రెస్టింగ్ కారణం ఉంది. విక్రమ్, శక వంటి తెలుగు క్యాలెండర్ల ప్రకారం 2024 జూన్ చివర్లో ఆషాడమాసం మొదలవుతుంది. ఇది జూన్ 23న స్టార్ట్ అయి జూలై 21న కంప్లీట్ అవుతుంది. ఇక ఈ ఏడాది ఆషాడ మాసంలో వచ్చే కృష్ణపక్షం 13 రోజులు మాత్రమే ఉంటుంది. నిజానికి కృష్ణపక్షం అంటే 15 రోజులు. కానీ ఈ 13 రోజుల కృష్ణపక్షం అనేది దాదాపు కురుక్షేత్ర యుద్ధం జరిగిన మహాభారత కాలంలో వచ్చిందట. అంటే దాదాపు 5,000 ఏళ్ల క్రితం వచ్చిన కృష్ణపక్షం ఈ ఏడాది ఆషాడంలో ఆరవ రోజున రావడంతో దాన్నే కల్కి మూవీకి సరైన రిలీజ్ నెలగా నిర్మాతలు భావించారని అంటున్నారు. దీనిపై మేకర్స్ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ కారణం మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు