Kalki2898AD: రూ.600 కోట్ల సినిమా తీసి..అరిగిన చెప్పులతో తిరిగిన డైరెక్టర్…!

Kalki2898AD: ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. దాదాపు నాలుగున్నర ఏళ్లపాటు ఈ సినిమా షూటింగ్ ని తీసి ఈరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. గత రెండు మూడు నెలల నుంచి ఈ సినిమాపై భారీ హైప్ పెంచిన చిత్రబృందం ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం విశేషం. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా…. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు.

ఇక ఈ సినిమాని అశ్విని దాదాపు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ప్రముఖ నటులు అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, శోభన, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్ పలువురు నటీనటులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాని 600 కోట్లకు పైగా బడ్జెట్ తో కేటాయించిన ఈ సినిమాకి విడుదలకు ముందే ఫ్రీ రిలీజ్ బిజినెస్ లోనే దాదాపుగా 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక నిన్న రాత్రి నుంచి థియేటర్స్ వద్ద నానా హంగామా సృష్టించారు.

భారీ కటౌట్ లు, ఫ్లెక్సీలు పెట్టారు. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలోనూ కల్కి ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ఈ సినిమాని చూడడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే తాజాగా నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. తాను పడిన కష్టానికి ప్రతిఫలం దొరికిందంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. అందులో అరిగిపోయి, చిరిగిపోయిన చెప్పులను ఫోటోను పోస్ట్ చేశాడు. చాలా కాలంగా ఇవే వేసుకుని తిరుగుతున్నాను. దాదాపు ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి నాలుగేళ్లుగా ఇవే చెప్పులను వాడుతున్నట్టుగా చెప్పకనే చెప్పేశాడు. ఇ

- Advertisement -

Kalki2898AD: Nagi hit blockbuster.. That scene is the highlight..!

న్ని రోజుల నా కష్టానికి ప్రతిఫలం దొరికింది అంటూ నాగ్ అశ్విన్ తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. ఇక ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్స్ ఇన్ని రోజుల నుంచి ఇవే చెప్పులను వాడుతున్నావా నువ్వు చాలా గొప్పోడివి సామి అంటూ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు ఏమో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. కనీసం చెప్పులు కొనుక్కోలేదా అని నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు