Kalki 2898 AD Promotions : కల్కి టీం కొత్త స్ట్రాటజీ… ఈ దెబ్బతో దేశవ్యాప్తంగా మూవీ పేరు మార్మోగాల్సిందే

Kalki 2898 AD Promotions : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్స్ కోసం కొత్త ప్రమోషన్ స్టాటజీని ఫాలో అవుతున్నారు మేకర్స్. తాజాగా మరో కొత్త విధానంతో దేశవ్యాప్తంగా కల్కి మూవీ పేరు మార్మోగిపోయేలా ప్లాన్ చేశామంటూ సోషల్ మీడియా వేదికగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ కల్కి ప్లాన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

స్ప్రెడ్ ద లైట్…

కల్కి మూవీ రిలీజ్ కి ఇంకా నెల రోజులపైనే టైం ఉంది. అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో ముందుగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఒక్కో ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై ఒక్కో లెవెల్ లో అంచనాలు పెంచే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు ఈవెంట్ల ద్వారా అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్న కల్కి మేకర్స్ తాజాగా స్ప్రెడ్ ది లైట్ అక్రాస్ ది నేషన్ అంటూ మరో కొత్త స్ట్రాటజీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అందులో భాగంగా కొన్ని వాహనాలకు స్క్రీన్ ను యాడ్ చేసి, అందులో కల్కి మూవీ ట్రైలర్ ప్రసారమయ్యేలా ప్లాన్ చేశారు. ఇకనుంచి ఈ వాహనాలు రాత్రిపూట దేశమంతటా తిరగబోతున్నాయి. అంటే ఎక్కడ చూసినా ఈ వాహనాలు కనిపించి కల్కి మూవీ వైపే ప్రేక్షకుల దృష్టిని మరల్చబోతున్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ నోట కల్కి మూవీ మాట అన్నమాట. ఇది చూసి అదిరిపోయే ప్లాన్ వేశారు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Kalki 2898 AD on X: "The ride to spread the light across the nation kicks off! #Kalki2898AD https://t.co/GiwETEuNFY" / X

- Advertisement -

ఒక్కో స్ట్రాటజీ ఒక్కో లెవెల్

ఇక ఇదివరకు కూడా ఇలాంటి ప్రమోషనల్ స్ట్రాటజీతోనే అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. ముందుగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇంటిముందు కల్కి గెటప్ లో కొంతమంది నిలబడడం మొదలుకొని, ఒక్కొక్కటిగా టీజర్లు, పోస్టర్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత ప్రభాస్ పెళ్లిని కూడా వాడేసుకున్నారు. స్పెషల్ పర్సన్ ని పరిచయం చేయబోతున్నాను అంటూ దేశవ్యాప్తంగా తన పెళ్లి గురించి చర్చకు దారి తీసారు ప్రభాస్. ఆ తర్వాత తీరా చూస్తే బుజ్జిని పరిచయం చేశారు. అది కూడా ముందు అందరిలో కొత్త అనుమానాలు రేకెత్తించి, ఆ తరువాత రామోజీ ఫిలిం సిటీలో ఓ పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేసి. ఇక ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేశారు. విజువల్ ఫీస్ట్ అంటూ ట్రైలర్ కు కూడా మంచి స్పందనే వచ్చింది. అంతలోనే మళ్లీ స్ప్రెడ్ ద లైట్ అంటూ ఇలా వాహనాల ద్వారా నూతన ప్రచార కార్యక్రమానికి కల్కి 2898 ఏడీ మేకర్స్ శ్రీకారం చుట్టారు. మరి ఎంతైనా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎక్కుతున్న మూవీ కదా. పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలంటే ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా ప్రమోషన్స్ చేయడం మేకర్స్ కు తప్పదు మరి. కాగా దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాస్ట్లీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 జూలై 27న థియేటర్లోకి రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు