Kalki 2898 AD : కల్కి ట్రైలర్ పై ఆర్జీవీ అలాంటి కామెంట్స్.. వదిలేదేలేదంటున్న ఫ్యాన్స్

Kalki 2898 AD : కల్కి రిలీజ్ ట్రైలర్ బయటకు వచ్చాక ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో కూడా కల్కి ట్రైలరే ట్రెండ్ అవుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి కల్కి ట్రైలర్ పై అలాంటి కామెంట్స్ చేసి మరోసారి సంచలనం సృష్టించారు. ఆయన చేసిన కామెంట్స్ చూసి ఆర్జీవిని వదిలేదే లేదు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇంతకీ ఆర్జీవి కల్కి గురించి ఎలాంటి కామెంట్స్ చేశాడో తెలుసుకుందాం పదండి.

లక్ష ప్రైజ్ అంటూ ఆ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ అయిన కల్కి 2898 ఏడి రిలీజ్ ట్రైలర్ సినిమాపై హైప్ గ్రాఫ్ ను నెక్స్ట్ లెవెల్ కి పెంచేసింది. యూట్యూబ్ లో ప్రస్తుతం కల్కినే నెంబర్ వన్ లో ట్రెండ్ అవుతుండడం విశేషం. ఈ క్రమంలోనే ఆర్జీవి ట్రైలర్ గురించి చేసిన ట్వీట్ సంచలనగా మారింది. దానికి కారణం ఏంటంటే ట్రైలర్ కి సంబంధించి ఆయన ఇచ్చిన పజిల్ తో పాటు సమాధానం చెప్పిన వాళ్లకు లక్ష బహుమతి అంటూ ఆఫర్ చేయడం.

Kalki 2898 AD' Release Trailer Unveils Why It's the Most Ambitious Must-Watch Film of the Year"

- Advertisement -

వివాదాస్పద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆర్జీవి తాజాగా మరోసారి కల్కిపై చేసిన కామెంట్స్ తో వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఆర్జీవి కల్కి ట్రైలర్ తనకు విపరీతంగా నచ్చింది అంటూ ఓ పజిల్ ని పోస్ట్ చేశాడు. అందులో కొన్ని సెంటెన్స్ ఇచ్చి మధ్యలో కొన్ని పదాలను మిస్ చేసి బ్లాంక్ గా వదిలేశాడు. ఓ రకంగా చెప్పాలంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్ లో ఇచ్చారు. ఆ పదాలను కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని ట్వీట్ కూడా చేశాడు. ఆయన ట్వీట్ వైరల్ అవుతుండడంతో ఇప్పటికే చాలామంది దానికి సమాధానం చెప్పారు కూడా. అయితే అందులో బూతులు ఉన్నాయని మరికొంత మంది మండిపడుతున్నారు. కల్కి మూవీ దేవుళ్ళ గురించి ఉంది. అలాంటి ట్రైలర్ ను బూతు పదాలతో పొగడడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి వీళ్ళకు వర్మ ఎలాంటి సమాధానం చెప్తాడో చూడాలి.

ఆర్జీవి స్టైల్ ప్రమోషన్స్

ఇప్పటికే ట్రైలర్ ద్వారా మంచి బజ్ క్రియేట్ కాగా, ఆర్జీవి చేసిన వివాదంతో కల్కి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఏదైతేనేం ఆర్జీవి సినిమా ప్రమోషన్స్ లో తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు అంటూ మరో వర్గం మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన కల్కి మూవీ జూన్ 27న థియేటర్లలోకి రాబోతోంది. సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ని చూసి కల్కి బాక్స్ ఆఫీసు రికార్డుకు తిరగరాయడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు