Kalki 2898 AD Record : సూర్యపుత్ర వైకర్త కర్ణ… ఈ పేరు బుక్ మై షో రికార్డ్‌లో నిలిచిపోయింది..!

Kalki 2898 AD Record : ప్రభాస్ నటించిన కల్కి సినిమా గత నెల 27వ తేదీన థియేటర్లో గ్రాండ్ గా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా నిర్మాత అశ్వినీ దత్ ఎక్కడా వెనక్కితగ్గకుండా… ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశాడు. దీంతో ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది కల్కి సినిమా. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ ఉండడమే కాకుండా చిత్ర బృందం కూడా సంతోషంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలను, సాధించిన రికార్డులను సైతం తెలియజేస్తూ ఉన్నారు. కల్కి సినిమా పలు రకాల సరికొత్త రికార్డులను కూడా సృష్టిస్తోంది.

Kalki 2898 AD Record : Suryaputra Vaikarta Karna... this name stuck in book my show record..!
Kalki 2898 AD Record : Suryaputra Vaikarta Karna… this name stuck in book my show record..!

బుక్ మై షో లో సరికొత్త రికార్డు..

ఇప్పుడు తాజాగా కల్కి సినిమా మరొక సరికొత్త రికార్డును సృష్టించినట్లుగా తెలుస్తోంది.. కల్కి సినిమా బుక్ మై షో లో రిలీజ్ కి ముందు టికెట్స్ ఓపెనింగ్ లో కూడా సరికొత్త రికార్డు సృష్టించింది.. దాదాపుగా మూడు వారాలపాటు అత్యధికంగా టికెట్స్ సేల్ అందుకున్న సినిమాగా కల్కి సినిమా నిలిచింది. ఇప్పటివరకు ఏ చిత్రానికి కూడా ఈ రేంజ్ లో రిలీజ్ కి ముందు గానీ రిలీజ్ తర్వాత గానీ మూడు వారాల పాటు టికెట్లు ఇంతలా అమ్ముడుపోయిన సందర్భాలు లేవట.

బుకింగ్ మొదలైన రోజు 3 లక్షలకు పైన అమ్ముడుపోయిన టికెట్లు..

బుక్ మై షో లో కల్కి సినిమా టికెట్స్ ఓపెనింగ్ నుంచి ఇప్పటివరకు తమ ఫ్లాట్ ఫామ్ లో అత్యధికంగా టిక్కెట్స్ అమ్ముడుపోయిన సినిమాలలో కల్కి సినిమా మొదటి స్థానం ఉన్నట్లు ప్రకటించింది. కల్కి సినిమా టికెట్స్ బుకింగ్ జూన్ 23 నుంచి ఓపెన్ చేయగా.. ఆ రోజే ఏకంగా 3 లక్షల 28 వేల టికెట్లు అమ్ముడుపోయాయని.. సినిమా విడుదలైన రోజు అంటే జూన్ 27న 11,20,000 టికెట్లు అమ్ముడుపోయాయని తెలిపారు. ఇక రిలీజ్ తర్వాత ఏకంగా 11,72,000 టికెట్లు అమ్ముడుపోయాయని తెలియజేయడం జరుగుతుంది.

- Advertisement -

ప్రభాస్ కర్ణ హైలైట్..

జులై 17న లక్ష 28 వేల టికెట్ల వరకు అమ్ముడుపోయాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లెక్క వేసుకుంటే బుక్ మై షో లోని ఇప్పటివరకు కోటి 21 లక్షల 50 వేల టికెట్లు వరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు మాత్రమే అత్యధికంగా బుక్ మై షో లో టికెట్లు సేల్స్ అవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా ప్రకటించింది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ కర్ణుడి పాత్రను చూపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అభిమానులు కూడా సరికొత్త రికార్డులను తిరగరాస్తున్న కర్ణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మొత్తం మీద కలుపుకొని ఇంకెన్ని టికెట్లు అమ్ముడు పోతాయో అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ట్విట్ అయితే వైరల్ గా మారుతున్నది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు