Kalki 2898 AD : బిగ్ అప్డేట్ ఇచ్చిన బిగ్ బీ… ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD” గురించి ఎలాంటి అప్డేట్ బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా గురించి బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

“కల్కి”లో బిగ్ స్టార్స్…
పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న “కల్కి” మూవీలో అందరూ బిగ్ స్టార్స్ నటిస్తుండడంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనే, దిశా పటాని ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కి” మూవీ రూపొందుతుండగా, లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది.

బిగ్ బీ అప్డేట్…
“కల్కి” మూవీని మే 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించేశారు. కానీ పలు కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతూ వస్తోంది. మేకర్స్ పలుమార్లు అనుకున్న సమయానికి మూవీ రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చినప్పటికీ రూమర్స్ మాత్రం ఆగలేదు. తాజాగా మరోసారి అమితాబ్ స్వయంగా ఈ మూవీ అనుకున్న డేట్ కు రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు. అలాగే మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. 81 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. “కల్కి” మూవీ కోసం ఆయన భారీ కాల్ షీట్లు కేటాయించగా, మొత్తానికి ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్ పూర్తయిందని స్వయంగా చెప్పుకొచ్చారు. ఆయన తన బ్లాగ్ లో నిన్న రాత్రి షూటింగ్ పూర్తి చేశానని, “కల్కి”కి సంబంధించిన షూటింగ్ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయని రాసుకొచ్చారు. అలాగే ముందుగా ప్రకటించినట్టుగానే మే 9న “కల్కి” మూవీ రిలీజ్ కానుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని అమితాబ్ వెల్లడించారు. దీంతో ఈ మూవీ ఎక్కడ పోస్ట్ పోన్ అవుతుందో అని టెన్షన్ పడుతున్న ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.

- Advertisement -

ఆ డేట్ సెంటిమెంట్…
“కల్కి” మూవీ క్రీస్తు శకం 2898లో మహాభారతం కాలం నుంచి ప్రారంభమవుతుందని, 6000 ఏళ్ల కాలంలో కథ నడుస్తుందని చెప్పి నాగ్ అశ్విన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడు “కల్కి”ని థియేటర్లలో వీక్షిద్దామా అని ఎగ్జైటింగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు “కల్కి” మూవీ అనుకున్న విధంగానే మే 9న రిలీజ్ కానుందనే గుడ్ న్యూస్ తో తెగ సంతోష పడుతున్నారు రెబల్ స్టార్ అభిమానులు. అయితే మే 9ని రిలీజ్ డేట్ గా అనౌన్స్ చేయడానికి వైజయంతి మూవీస్ వారికి ఓ సెంటిమెంట్ ఉంది. ఆరోజు వైజయంతి మూవీస్ వ్యవస్థాపక దినోత్సవం. అలాగే గతంలో నిర్మాత అశ్విని దత్ నిర్మించిన సినిమాలు కొన్ని మే 9న థియేటర్లోకి వచ్చి రికార్డులు బద్దలు కొట్టాయి. అందుకే మళ్ళీ మే 9నే పాన్ వరల్డ్ మూవీ “కల్కి”ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు