Kalki 2898AD: దేవర ఫిక్స్.. మరి కల్కి సంగతేంటి..?

ఈ ఏడాది సమ్మర్ కి విడుదలవుతుందనుకున్న ఎన్టీఆర్ దేవర సినిమా.. నిన్నటి రోజున ఏకంగా దసరాకి పోస్ట్ పోన్ చేస్తూ ప్రకటించారు.. ఈ సినిమాను డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా కూడా అదే సమయానికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మొదట దేవర చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని చిత్ర బృందం అనుకోగా..VFX పనుల వల్ల ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి తరుణంలోనే సమ్మర్ కి విడుదల అవుతుందనుకున్న మరో భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898AD సినిమా.. మే 9వ తేదీన రిలీజ్ డేట్ ని లాక్ చేశారు చిత్ర బృందం. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై.. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. ప్రస్తుతం సినిమా అవుట్ పుట్ విషయంలో కూడా చిత్ర బృందం చాలా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.. ముఖ్యంగా అనుకున్న సమయానికి ఈ సినిమాని విడుదల చేయాలని హడావిడి చేయకుండా అనుకున్న అవుట్ పుట్ వచ్చిన తర్వాతే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

దీంతో అటు ప్రభాస్ అభిమానులకు కల్కి సినిమా అసలు మే నెలలో వస్తుందా అనే అనుమానాలు మొదలవుతున్నాయి.. ఇక ఎన్టీఆర్ దేవర సినిమా కూడా ఏప్రిల్ లో రిలీజ్ అనుకున్న అభిమానులు.. ఇప్పుడు అక్టోబర్ కి వాయిదా పడడంతో.. కల్కి సినిమా కూడా మే నుంచి వాయిదా పడితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో అంటూ ప్రభాస్ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.. కల్కి సినిమా మే నెలలో రిలీజ్ అయితే సరిపోతుంది.. లేదంటే ఈ సినిమా విడుదల తేదీ కోసం మరొక డేట్ ని చూసుకోవాల్సి ఉంటుంది..

- Advertisement -

ఆల్రెడీ ఆగస్టు 15న అల్లు అర్జున్ పుష్ప 2, సెప్టెంబర్ 27న పవన్ సినిమా విడుదల తేదీలను లాక్ చేశారు చిత్ర బృందం.. దీన్ని బట్టి చూస్తే కల్కి సినిమా పోస్ట్ పోన్ అయితే అక్టోబర్లో దేవరాకి పోటీగా.. విడుదల చేయవలసి ఉంటుంది.. లేదంటే జూన్, జూలై నెలలో ఈ సినిమాని విడుదల చేయాలి. మరి చిత్ర బృందం కల్కి సినిమా రిలీజ్ డేట్ పైన మరొక సారి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా సెలవులను దృష్టిలో పెట్టుకొని సినిమా రిలీజ్ చేస్తే క్యాష్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని.. అభిమానులు కూడా చిత్ర బృందానికి సలహా ఇస్తున్నారు..

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు