Kalki 2898 AD Trailer : దుమ్ము రేపుతున్న కల్కి ట్రైలర్… కావల్సింది ఈ కిక్కే భయ్యా

Kalki 2898 AD Trailer : మోస్ట్ అవైటింగ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ  సెకండ్ ట్రైలర్ వ్యూస్ పరంగా దుమ్ము లేపుతోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ ప్లేస్ ను కబ్జా చేసి వ్యూస్ సునామీని సృష్టిస్తోంది. రిలీజ్ చేసి 24 గంటలు కూడా కాకముందే వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది. మరి ఇప్పటిదాకా సెకండ్ ట్రైలర్ కు వచ్చిన వ్యూస్ ఎన్నో తెలుసుకుందాం పదండి.

ట్రెండింగ్ లో కల్కి ట్రైలర్…

శుక్రవారం అంటే జూన్ 21న సాయంత్రం 6 గంటలకు కల్కి 2898 ఏడీ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే చెప్పిన టైంకి కాకుండా రెండు గంటల 45 నిమిషాలు ఆలస్యంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఆ వెయిటింగ్ కి తగ్గ ప్రతిఫలం దక్కింది అన్నట్టుగా ఉంది కల్కి సెకండ్ ట్రైలర్. ఫైనల్ వార్ అంటూ మేకర్స్ మూవీ రిలీజ్ కు ఐదు రోజుల ముందు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసి అందరినీ మెస్మరైజ్ చేశారు. మొదటి ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో పాటు సినిమాపై కాస్త క్లారిటీని ఇచ్చినట్టుగా అయింది. ఇప్పటిదాకా సినిమా ప్రమోషన్ల గురించి టెన్షన్ పడిన డార్లింగ్స్ ఈ ట్రైలర్ ని చూశాక హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

Image

- Advertisement -

ఇక అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటున్న కల్కి సెకండ్ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నాడం విశేషం. అంతేకాదు 24 గంటలు కూడా గడవకముందే 20 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. దీంతో ఇప్పటిదాకా జరిగిన ప్రమోషన్స్ చూసి డీలా పడిన ప్రభాస్ అభిమానుల్లో ఈ ట్రైలర్ తో ఫుల్ జోష్ వచ్చేసింది. యూట్యూబ్ లో సునామీని సృష్టిస్తున్న కల్కి ట్రైలర్ జోరు చూస్తుంటే సినిమా హిట్ అవ్వడం పక్క అనే నమ్మకం కలిగింది చాలామందికి.

ఈ కిక్కే భయ్యా కావాల్సింది…

సినిమా ప్రమోషన్ల విషయంలో నిన్న మొన్నటిదాకా ప్రభాస్ అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. ఫస్ట్ రిలీజ్ చేసిన ఒకటి రెండు పోస్టర్లు మినహా ఇప్పటిదాకా వచ్చిన ఏ కంటెంట్ కూడా పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది. రీసెంట్ గా ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఏదో ప్రెస్ మీట్ జరిగినట్టుగానే అనిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. అడపా దడపా నాగీ సినిమా గురించి తెలుపుతూ కొన్ని వీడియోలు రిలీజ్ చేసినప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఇలాగైతే కల్కి మూవీ అనుకున్న విధంగా ఆడటం కష్టమేనని సినీ విశ్లేషణలతో సహా మూవీ లవర్స్ అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కల్కి సెకండ్ ట్రైలర్ ని కట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. కరెక్ట్ గా సినిమా రిలీజ్ కు నాలుగైదు రోజుల ముందు ట్రైలర్ ను రిలీజ్ చేసి హైప్ ను ఒక్కసారిగా పెంచేశారు. రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తున్న ఈ ట్రైలర్ ను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ కిక్కే భయ్యా కావాల్సింది అంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ జోష్ ను మూవీ రిలీజ్ అయ్యేదాకా ఇలాగే కంటిన్యూ చేయగలిగితే కల్కికి తిరుగుండదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు