Kalki 2898AD: హనుమాన్ క్లైమాక్స్ కే పూనకాలు… కల్కి క్లైమాక్స్ కి ఏమైపోతారో..?

Kalki 2898AD.. దాదాపు నాలుగున్నర సంవత్సరాల శ్రమ తర్వాత రూపొందిన అత్యద్భుతమైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం కల్కి 2898AD.. ఈ చిత్రంలో భారీ తారాగణం సందడి చేసింది.. అంతేకాదు ప్రత్యేకించి హాలీవుడ్ వీ ఎఫ్ ఎక్స్ సంస్థలను కూడా ఈ సినిమా కోసం ఉపయోగించారు. ఒక్క బుజ్జి వెహికల్ కోసమే దాదాపు రూ.4 కోట్లు ఖర్చు చేశారు అంటే ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రూ .600 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను ఒక్కొక్కటిగా షేర్ చేస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని.. ప్రత్యేకించి క్లైమాక్స్ అదిరిపోయింది అని చెబుతున్నారు.. ముఖ్యంగా హనుమాన్ క్లైమాక్స్ కే అభిమానులకు పూనకాలు వచ్చేసాయి.. ఇక కల్కి క్లైమాక్స్ కి ఏమైపోతారో అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

హనుమాన్ క్లైమాక్స్..

Kalki 2898AD: Hanuman Climax Ke Poonakalu... What will happen to Kalki Climax..?
Kalki 2898AD: Hanuman Climax Ke Poonakalu… What will happen to Kalki Climax..?

ముందుగా హనుమాన్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా మరింత ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది అని చెప్పవచ్చు .. ఇక హనుమాన్ క్లైమాక్స్ విషయానికి వస్తే.. మైకేల్ తో జరిగిన చివరి యుద్ధంలో.. తేజ దగ్గర ఉండే రత్నాన్ని హనుమంతుడు తిరిగి పొందుతాడు. క్లైమాక్స్ స్టార్ట్ అయిన తర్వాత యాక్షన్స్ అన్వేషాలు ముఖ్యంగా హెలికాప్టర్ సన్నివేశాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. చివర్లో రత్నం నాశనమైనప్పుడు కథ సరికొత్త మలుపు తీసుకుంటుంది. ఇక రత్నం నాశనమైన తర్వాత ఆ రక్తపు బిందువు తిరిగి హనుమంతుడి కంటికి చేరుకుంటుంది.. ఈ సన్నివేశాలను ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. థియేటర్లలో ఈ సినిమా చూసినంత సేపు అభిమానులు సీట్లలో కూర్చోకుండా లేచి చాలా ఉత్కంఠ గా చూస్తారు.. అంత అద్భుతంగా ఈ సినిమా క్లైమాక్స్ ని రూపొందించారు ప్రశాంత్ వర్మ.

కల్కి 2898 AD క్లైమాక్స్..

మొత్తానికైతే నాగ్ అశ్విన్ ఒక మాయా లోకాన్ని సృష్టించారు.. అద్భుతమైన విజువల్స్ తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.. ముఖ్యంగా క్లైమాక్స్ వచ్చేంత వరకు కూడా ఆడియన్స్ థియేటర్లలో ఒక ట్రాన్స్ లో ఉండిపోతారు. అప్పటివరకు సినిమా ఏదో నడుస్తోంది అన్నట్టుగా ఉంటుంది.. అయితే ఒక్కసారిగా క్లైమాక్స్ వచ్చేసరికి సినిమా మొత్తం మారిపోతుంది.. ఆడియోన్స్ కి పిచ్చెక్కిపోతుంది.. హనుమాన్ చిత్రమే ఒక రేంజ్ లో ఉంది అంటే ఆ సినిమా క్లైమాక్స్ కంటే 100 టైమ్స్ బెటర్ గా కల్కి క్లైమాక్స్ ఉంటుందట.. ముఖ్యంగా కల్కి క్లైమాక్స్ చూసిన తర్వాత బయటకు వచ్చిన ఆడియన్స్ కూడా అదే ట్రాన్స్లో ఉంటున్నారని.. సినిమా చూసినవారు చెబుతున్నారు.. క్లైమాక్స్ చాలా బాగుంది అని చెప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే క్లైమాక్స్ పైనే సినిమా కథ మొత్తం ఆధారపడిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా నాగ్ అశ్విన్ మరో మాయా లోకాన్ని సృష్టించి.. ఒక అద్భుతమైన సినిమాని తెరకెక్కించారని సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు