Kalki 2898AD: ఈ 5 సీన్లు మరీ దారుణం… అస్సలు చూడలేము రా బాబు..!

Kalki 2898AD.. ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. దీపిక పదుకొనే, దిశాపటాని హీరోయిన్లుగా.. అమితాబ్ బచ్చన్, కమలహాసన్ కీలకపాత్రల్లో.. విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ సల్మాన్ , మృనాల్ ఠాకూర్ తదితర యంగ్ నటులు నటించిన భారీ ప్రాజెక్టు చిత్రం కల్కి 2898AD.. ఇప్పటికే ఓవర్సీస్ లో భారీ అంచనాల మధ్య సినిమా విడుదలయ్యింది.. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. కానీ ఈ సినిమాలో వచ్చే ఈ 5 సన్నివేశాలు మాత్రం అత్యంత దారుణమనే చెప్పాలి.. అసలు అలాంటి సన్నివేశాలను.. ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలేమని.. సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. మరి ప్రభాస్ అభిమానులను అత్యంత దారుణంగా నిరాశపరిచిన ఆ 5 అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Kalki 2898AD: Kalki movie plus.. these are the minuses..!
Kalki 2898AD: Kalki movie plus.. these are the minuses..!

1. ఈ సినిమా మొత్తంలో ఓవరాల్ గా క్లైమాక్స్ ఒక్కటే చాలా గ్రాండ్ గా అద్భుతంగా ఉంది.. మిగతా పార్ట్ అంతా ఓకే కానీ మొదటి భాగంలో చాలా వరకు లాక్ సన్నివేశాలు ఉన్నాయి.. ప్రత్యేకించి ఆ శంబల, కాంప్లెక్స్.. వీటి అర్థం అన్నీ కూడా అభిమానులకు కొంచెం గందరగోళంగా అనిపించాయి.

ఈ శంబల ఏంటి? ఆ కాంప్లెక్స్ ఏంటి? అనే విషయానికి వస్తే.. ప్రపంచంలో మొదటి నగరంగా ఉద్భవించిన కాశీ నగరాన్ని.. ఈ సినిమాలో ప్రపంచం అంతమైన తర్వాత మిగిలిన చిట్ట చివరి నగరంగా కాశీ పట్టణాన్ని చూపించారు.. దుర్భర పరిస్థితులు, కరువు వల్ల అంతమైపోతూ ఉంటుంది. దీనికి ఒక కిలోమీటర్ పైన సకల సౌకర్యాలు కలిగిన కాంప్లెక్స్ ను నిర్మించారు. భూమి మీద ఉండే నీళ్లు, ప్రకృతి వంటివన్నీ ఈ కాంప్లెక్స్ లాగేసుకుంటూ ఉంటుంది. ఇంకోటి శరణార్థుల ప్రపంచం.. అన్ని మతాలకు చెందిన శరణార్థులు ఉండే ప్రపంచం శంబల. అయితే ఈ అంశాలు కాస్త గందరగోళంగా అనిపించాయని చెప్పవచ్చు.

- Advertisement -

2. ప్రభాస్ పాత్ర నిడివి.. పేరుకే ఈ సినిమాలో ప్రభాస్ కథానాయకుడు.. కానీ ఆయన కనిపించేది కేవలం 1:00 గంట నుండి 1: 20 నిమిషాలు మాత్రమే.. సినిమాలో ప్రభాస్ పాత్రను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన అభిమానులకు ఆయన పాత్ర నిడివి పెద్దగా లేకపోవడం కాస్త నిరాశ పరిచిందని చెప్పవచ్చు.

3. ప్రత్యేకించి కొన్ని లెంగ్తీ సీన్స్ ఉంటాయి.. అప్పటికే క్లబ్ గా ఉన్న టైంలో అటువంటి సీన్స్ రావడం ఏం సినిమా తీశారు.. రా బాబు.. అనే ఒక చిన్న ఫీల్ వస్తుంది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి మొత్తం సినిమా చూసిన తర్వాత నాగ్ అశ్విన్ ను తక్కువ అంచనా వేసామని అందరూ తప్పకుండా అనుకుంటారు.

4. మరోవైపు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాలో పెద్దగా లేదు.. బ్రహ్మానందం అంటే చాలా ఎక్కువ సన్నివేశాలలో ఊహించుకుంటారు.. కానీ బ్రహ్మానందంఈ సినిమాలో కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితం అవడం అభిమానులను నిరాశకు గురిచేస్తాయి.

5. ఇక ప్రభాస్ అంటే చాలా పెద్ద హీరో.. మొదటి తెలుగు పాన్ ఇండియా హీరో కూడా.. అలాంటి హీరో భైరవ తరచూ అశ్వద్ధామ చేతిలో దెబ్బలు తినడం… ప్రభాస్ అభిమానులకు పెద్దగా నచ్చకపోవచ్చు.. ఇది కూడా సినిమాకి మైనస్ గానే మిగిలింది.

ఈ అంశాలన్నీ కూడా సినిమా చూసిన తర్వాత అభిమానులను కాస్త నిరాశకు గురిచేశాయని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు