Kalki 2898AD: కల్కి సీక్వెల్ కాదు యూనివర్స్.. క్లైమాక్స్ లో క్లారిటీ..!

Kalki 2898AD: బాహుబలి సినిమా తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన ప్రభాస్ కు కల్కి చిత్రం భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.. దాదాపు నాలుగు సంవత్సరాల నిర్విరామ శ్రమ తర్వాత వచ్చిన చిత్రం కల్కి 2898AD.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం ఇది. టైం ట్రావెల్ మూవీ గా వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.. ఈ సినిమాతో ప్రభాస్ పేరు కూడా మారిపోయిందని చెప్పవచ్చు. మొన్నటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ అనిపించకుండా ఇకనుంచి శ్రీ ప్రభాస్ అని పిలిపించుకోబోతున్నారు.. మొత్తానికి అయితే సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది అని చెప్పడం సందేహం లేదు.. ఇకపోతే తాజాగా ఒక సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అంటే కచ్చితంగా ఆ సినిమా సీక్వెల్ ప్రకటిస్తారు చిత్ర బృందం.. అయితే ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్ కాదు ఏకంగా యూనివర్స్ గా నిర్మించబోతున్నారని సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సినిమాకి అవే హైలెట్..

Kalki 2898AD: Kalki Sequel Not Universe.. Clarity in Climax..!
Kalki 2898AD: Kalki Sequel Not Universe.. Clarity in Climax..!

దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ ను ఒక రేంజ్ ఎలివేషన్స్ తో చూపించి అభిమానులకు ఫుల్ మీల్స్ అందించారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్లుగా దీపికా పదుకొనే, దిశా పటానీ అద్భుతంగా ఆకట్టుకున్నారు.. కేవలం గ్లామర్ కోసం దీపికను వాడకుండా.. కథలో భాగం చేసి ఆమె అద్భుతమైన నటనకు స్కోప్ ఇచ్చారు.. దిశా పటానీ కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది .. పైగా అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు.. ఈ వయసులో కూడా యాక్షన్స్ సన్నివేశాలతో ఆయన అలరించడం నిజంగా ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం అని చెప్పాలి. ప్రత్యేకించి ప్రభాస్ , అమితాబ్ బచ్చన్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక వీరిద్దరిని తెరపైన చూపించిన తీరు అద్భుతం. ఫైట్ సీన్స్ లో ఇద్దరికీ ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కల్కి 2898AD సీక్వెల్ కాదు యూనివర్స్..

ఇక కమల్ హాసన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఎండింగ్లో కమల్ హాసన్ పాత్రతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చేశాడు.. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అని చెప్పకపోయినా కూడా కల్కి యూనివర్స్ ని ప్రకటించారు అంటే.. ఈ సినిమాని మరిన్ని భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఇకపోతే కల్కి యూనివర్స్ లో భాగంగా రెండో పార్ట్ , మూడో పార్ట్ రానున్నట్లు సమాచారం. ఇకపోతే రెండో పార్టు రావడానికి మరో మూడున్నర సంవత్సరాల సమయం పడుతుందని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు.. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ ప్రకటించకుండా ఏకంగా యూనివర్స్ ప్రకటించేసరికి అప్పుడే అందరూ అంచనాలు పెంచేసుకుంటున్నారు..

- Advertisement -

సీక్వెల్ టైటిల్ కూడా రివీల్..

పైగా మూడున్నర ఏళ్ల తర్వాత రాబోయే సీక్వెల్ కి కూడా క‌ల్కి 3102 BC అయితే బాగుంటుందని.. ఈ టైటిల్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు