Kalki 2898AD: సరికొత్త ప్రమోషన్స్.. సెలబ్రిటీ కిడ్స్ టార్గెట్.. సర్ప్రైజ్ తో షాక్..!

Kalki 2898AD: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 AD.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే .ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ని కూడా చిత్ర బృందం చేపట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే అమెజాన్ ప్రైమ్ లో బుజ్జి , భైరవ యానిమేషన్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ బుజ్జి , భైరవలా ట్రాక్ కి చిన్నపిల్లలు మరింత కనెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రమోషన్స్ తో ముందుకు వచ్చింది కల్కి చిత్ర బృందం. సెలబ్రిటీ కిడ్స్ ని టార్గెట్ చేసుకొని సెలబ్రిటీల పిల్లలకు బుజ్జి రాసిన లేఖ తోపాటు ఏదో బహుమతులను కూడా పంపినట్లు తెలుస్తోంది..

సెలబ్రిటీల పిల్లలకు బుజ్జి రాసిన లేఖ..

Kalki 2898AD: Latest Promotions.. Celebrity Kids Target.. Shock with Surprise..!
Kalki 2898AD: Latest Promotions.. Celebrity Kids Target.. Shock with Surprise..!

ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లలు ఈ గిఫ్ట్ లను అందుకున్న తర్వాత ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఇవి కాస్త వెలుగులోకి వచ్చాయి. బుజ్జి ప్రత్యేకంగా పంపిన లేఖలో ఏముంది అనే విషయానికి వస్తే.. నేను బుజ్జిని భైరవాకు మంచి స్నేహితురాలని.. ఇకపై మీకు కూడా మంచి స్నేహితురాలిని.. బుజ్జి అంటే చిన్నది అని అర్థం.. కానీ నేను మాత్రం చిన్నదాన్నే అయినా చాలా చేయగలను.. నాకు సూపర్ బ్రెయిన్ ఉంది.. సూపర్ హీరోలకు నా అవసరం తప్పకుండా ఉంటుంది.. జూన్ 27వ తేదీన మీ అందరిని కలుసుకోవడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఆ లేఖలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

చిరంజీవి మనవరాళ్లు నివృతి , నవిష్క లకు బుజ్జి గిఫ్ట్స్

ఇకపోతే ఈ లేఖతోపాటు ఈ గిఫ్ట్ లు కేవలం సెలబ్రిటీల పిల్లలకు మాత్రమే పంపుతున్నారా? లేదా బయట జనాలలో కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి పంపుతున్నారా ?అన్నది మాత్రం తెలియలేదు.. ఇక చిరంజీవి మనవరాలు నివృతి మాత్రం తనకు వచ్చిన వాటిని తాజాగా షేర్ చేసింది.. అలాగే నవిష్క, నివృతీ లకు బుజ్జీ నుంచి ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక కల్కి టీం ఇలా ఎవరు చేయని విధంగా సరికొత్తగా సెలబ్రిటీల పిల్లల్ని కూడా ఆకర్షిస్తూ.. కొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతూ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.. ఇప్పటికే యానిమేషన్ ఎపిసోడ్స్ ద్వారా బుజ్జి, భైరవల స్నేహం, భైరవ రాజన్ ( బ్రహ్మానందం) ట్రాక్ ను పరిచయం చేశారు. ఇకపోతే బుజ్జి క్యారెక్టర్ కి మహానటికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి సినిమాలో కీలక పాత్ర పోషించి.. ఏకంగా జాతీయస్థాయి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ నాగ్ అశ్విని పిలుపు మేరకు బుజ్జి క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది..

- Advertisement -

ప్రభాస్ ఆశలన్నీ ఈ మూవీ పైనే..

ఇక ప్రభాస్ విషయానికొస్తే.. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోబోతున్నారని సమాచారం. మరి భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా జూన్ 27వ తేదీన ఎలాంటి ఫలితాలను దక్కించుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు