Kalki 2898AD : బుజ్జి కోసం ఎలన్ మస్క్‌ను గెలికిన నాగ్ అశ్విన్… ఎలాంటి రిప్లే వస్తుందో…

Kalki 2898AD..ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కల్కి 2898AD సినిమా హవానే కనిపిస్తోంది. ముఖ్యంగా అభిమానులు సైతం ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. భారీ బడ్జెట్ సినిమా అవ్వడమే కాకుండా ప్రభాస్ ఇందులో సరికొత్తగా కనిపించబోతున్నారని తెలిసి మంచి హైప్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం శరవేగంగా పాల్గొంటుంది..

జూన్ 27న థియేటర్లలో సందడి..

జూన్ 27వ తేదీన కల్కి సినిమాని విడుదల చేయబోతున్నారు..ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే ప్రమోషన్స్ ను చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతోంది. ఈ క్రమంలోనే బుజ్జి అంటూ ఒక క్యారెక్టర్ తెరపైకి వచ్చింది.. ఏంటి బుజ్జి అంటే ప్రభాస్ ఇందులో నడిపే వెహికల్ పేరు బుజ్జి అని.. ఇటీవలే ఆ బుజ్జి వెహికల్ ను చాలా గ్రాండ్ గానే లాంచ్ చేయడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ తో కలిసి కల్కి చిత్ర బృందం బుజ్జి వెహికల్ ను తయారు చేశారు. ఆ కొత్త కారును చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు..ఈ బుజ్జి వెహికల్ ముఖ్యంగా హైటెక్ రోబో కార్ అన్నట్లుగా కనిపిస్తోంది.

బుజ్జి కోసం కీర్తి సురేష్ వాయిస్ ఓవర్..

ఈ సినిమాలో బుజ్జి కారు కోసం హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ని బ్యాగ్రౌండ్ లో అందించారు. మరో కొద్ది రోజులలో కల్కి సినిమా విడుదల కాబోతుందని తెలిసి అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమలహాసన్ దీపికా పదుకొనే, దిశాపటాని తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రమోషన్స్ తో ఇతర దేశాలలో కూడా బుజ్జి కారును తిప్పుతూ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు కల్కి టీమ్..ఇప్పుడు చెన్నై రోడ్లో పై కూడా ప్రభాస్ బుజ్జి వెహికల్ తిరుగుతూ ఉండగా అక్కడ ప్రజలు చూసి ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

బుజ్జి నీ నడపడానికి ఎలన్ మస్క్ కు ఆహ్వానం..

Kalki 2898AD : Nag Ashwin ask Elon Musk for Bujji.. What kind of replay will come...
Kalki 2898AD : Nag Ashwin ask Elon Musk for Bujji.. What kind of replay will come…

అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ వీడియో పైన నాగ్ అశ్విన్ రియాక్ట్ అవుతూ ఎలన్ మస్క్ ను ట్యాగ్ చేశారు..’ ప్రియమైన ఎలన్ మస్క్ సార్ మా బుజ్జిని చూడడానికి , నడపడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అంటూ తెలియజేశారు.. అయితే ఇది 6 టన్నుల బరువు ఉన్న ఒక వాహనమని.. ఫుల్ ఎలక్ట్రిక్ వాహనం అని.. ఇదొక అద్భుతమైన ఇంజన్ ఇది…మీకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది అంటూ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ చేసిన ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. మరి ఈ ట్వీట్ కి ఎలన్ మస్క్ స్పందిస్తారా లేదా అన్నది చూడాలి .. మొత్తానికైతే బుజ్జి కాలింగ్ అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. ఒకవేళ ఈయనే వచ్చి ఈ వెహికల్ ను నడిపితే ఈ సినిమాకు మరింత ప్రమోషన్ జరుగుతుంది అనడంలో సందేహం లేదు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు