Kalki 2898AD: అలాంటి తప్పు చేసిన నాగ్ అశ్విన్.. కలెక్షన్స్ పై ఎఫెక్ట్..!

Kalki 2898AD.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం Kalki 2898AD.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.. దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల కష్టం తర్వాత ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది..ఎట్టకేలకు నేడు థియేటర్లలోకి వచ్చేసింది ఈ సినిమా.. మొదటి షో నుంచే థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. భైరవ క్యారెక్టర్ లో ప్రభాస్, మరియం పాత్రలో శోభన, యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్, అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ ఇలా ఎవరికి వారు తమ పాత్రలకు జీవం పోసి నటించారు. ప్రత్యేకించి బుజ్జి వెహికల్ , బ్రహ్మానందం కామియో రోల్, దుల్కర్ సల్మాన్ పాత్ర , విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అన్నీ కూడా సినిమాకు హైలెట్గా నిలిచాయి..

నాగ్ అశ్విన్ మిస్టేక్.. కలెక్షన్స్ పై దెబ్బ పడనుందా..?

Kalki 2898AD: Nag Ashwin made such a mistake.. Effect on collections..!
Kalki 2898AD: Nag Ashwin made such a mistake.. Effect on collections..!

అయితే ఇవన్నీ బాగానే ఉన్నా.. నాగ్ అశ్విన్ చేసిన ఒక చిన్న మిస్టేక్.. సినిమా కలెక్షన్ల పైన దెబ్బ పడుతోందని చెప్పవచ్చు. ఇక ఏంటా మిస్టేక్ అంటే.. ప్రమోషన్స్ పెద్దగా చేపట్టకపోవడమే.. కథపరంగా సినిమా చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ.. ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఈ సినిమా ఎక్కువ మంది ప్రజలకు చేరలేకపోయింది.. తద్వారా సినిమా కలెక్షన్ల పైన దెబ్బ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికీ రాజమౌళి కేవలం ప్రమోషన్ల కోసమే సుమారు రూ.20 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తారనడంలో సందేహం లేదు.. ముఖ్యంగా ముంబై ,చెన్నై, హైదరాబాద్ అంటూ ప్రధాన నగరాలలో సినిమా ప్రమోషన్లను చేపడుతూ భారీ స్థాయిలో ప్రేక్షకులకు సినిమా రీచ్ అయ్యేలా చేస్తారు.. ఆయనకు మార్కెట్ ఎలా చేసుకోవాలో బాగా తెలుసు.. ఆ టాలెంటే ఆయనను ఆస్కార్ వరకు తీసుకెళ్లిందని చెప్పడంలో సందేహం లేదు.

కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న కల్కి 2898AD..

ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి కారణం.. రాజమౌళి సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ అనే చెప్పాలి.. మరి ఇంత తెలిసి కూడా నాగ్ అశ్విన్ ప్రమోషన్స్ విషయంలో ఎందుకు వెనుకడుగు వేశారో అర్థం కావడం లేదు. ఇప్పటికే బడ్జెట్ కోసం తన మామ అశ్వినీ దత్ చేత రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేయించాను అన్న ఒక ఫీలింగ్ ఆయనలో కలిగిందో ఏమో అందుకే ప్రమోషన్స్ కి అంత ఖర్చు పెట్టలేకపోయారు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. మరొకవైపు దీనికి ఏదైనా ఇంకొక కారణం అయి ఉండవచ్చు అంటూ ఇంకో కొంతమంది కామెంట్ చేస్తున్నారు.. ఏది ఏమైనా సినిమా చాలా అద్భుతంగా ఉంది అయితే ఈ సినిమాకు అంతే అద్భుతంగా ప్రమోషన్స్ చేపట్టి ఉండి ఉంటే కచ్చితంగా కలెక్షన్లు కూడా రెట్టింపు స్థాయిలో ఉండేవేమో అని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక రూ.700 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా అప్పుడే కలెక్షన్ లో సునామీ సృష్టించడం మొదలుపెట్టింది.. ఫుల్ రన్ ముగిసేసరికి ఏ రేంజ్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు