Kalki 2898AD: నిర్మాత అశ్వినీ దత్ కు నోటీసులు. కారణం..?

Kalki 2898AD: ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రంగా విడుదలైన చిత్రం కల్కి 2898AD. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించడం జరిగింది. ప్రభాస్ హీరోగా దిశాపటాని, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమలహాసన్ తదితర నటీనటుల సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. మహాభారత యుద్ధ కథను ఈ చిత్రంలో కాస్త యాడ్ చేయడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో వెళ్లిపోయింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రశంసిస్తూ ఉన్నారు.

Kalki 2898AD: Notices to producer Ashwini Dutt. The reason..?
Kalki 2898AD: Notices to producer Ashwini Dutt. The reason..?

టికెట్ ధరల పెంపు పై అభ్యంతరాలు..

కల్కి సినిమా విడుదలకు ముందు టికెట్ల ధరల పెంపు విషయం ఒక వివాదాస్పదకరంగా మారింది. ముఖ్యంగా కల్కి సినిమాకి ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల పాటు టికెట్లు ధరలను పెంచుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే మరో నాలుగు రోజుల పాటు ఈ టికెట్లు రేట్లు పెంచడం పైన ఒక పిటిషన్ కూడా హైకోర్టులో వేశారు.. దీంతో టికెట్ల రేటు పెంపు పైన స్టే కూడా ఇవ్వాలంటూ కోరడం జరిగింది.. అయితే ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి కోర్టు.. ప్రత్యేకమైన టికెట్ ధరలను ఏ చిత్రానికైనా కేటాయించడానికి ప్రభుత్వానికి అధికారం ఉందా లేదా అనే విషయం పైన హైకోర్టు అనుమానాన్ని వ్యక్తం చేసింది.

హైకోర్టులో పిటీషన్..

అయితే ఇందులో కౌంటర్లు దాఖలు చేయాలంటూ.. కల్కి సినిమా నిర్మాత అశ్వినీ దత్ కు నోటీసులు సైతం జారీ చేసినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసినట్లుగా సమాచారం. కల్కి సినిమా జూన్ 27వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల పాటు టికెట్ల ధరలను అధిక ధరకే పెంచుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇప్పటికే పెంచిన ధరలతో వారం పూర్తి చేసుకొని.. 10 రోజుల వైపు అడుగులు వేస్తూ ఉన్న సమయంలో..పైగా టికెట్ల రేట్లు ఏపీ ప్రభుత్వం కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడంతో అభ్యంతరాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

నిర్మాత వివరణ ఇస్తారా..

అయితే మరో నాలుగు రోజులపాటు కల్కి సినిమా టికెట్ల ధరలను పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వెంటనే టికెట్ ధరల పెంపు పైన స్టే ఇవ్వాలని నిర్మాత అశ్వినీ దత్ ను హైకోర్టు సైతం కోరినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయం పైన అటు కల్కి నిర్మాత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఏదేమైనా పది రోజుల టికెట్ ధరలు పెంచి.. ఆడియన్స్ కు చుక్కలు చూపిస్తున్న నిర్మాతలు.. కనీసం 10 రోజుల తర్వాత అయినా టికెట్ ధరలను తగ్గిస్తుందేమో అనుకుంటే ఇప్పటికే ఈ విషయం పైన స్పందించలేదు… అందుకే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో హైకోర్టు సరైన సమాధానం ఇవ్వాలని కోరింది మరి నిర్మాతలు ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు