Kalki 2898AD OTT Record: ఓటీటీలో సంచలన రికార్డ్.. వరల్డ్ వైడ్..!

Kalki 2898AD.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో కలసి కల్కి 2898AD అనే ఫ్యూచరిస్టిక్ ఫిలిం చేసి ఏకంగా పాన్ ఇండియా స్టార్డంను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ నటులతో సినిమాలు చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ ఆయన వారసురాళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సినిమా విడుదలై ఊహించని రికార్డు సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త సంచలనం సృష్టించింది ఈ సినిమా.

Kalki 2898AD OTT Record: Sensational Record in OTT.. World Wide..!
Kalki 2898AD OTT Record: Sensational Record in OTT.. World Wide..!

ఆగస్టు 22 నుండి ఓటీటీలో..

ఇక ఇందులో కమలహాసన్ , దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ లాంటి ఇండియన్ సినీ దిగ్గజాలు నటించారు. విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా త్వరలోనే రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో సీక్వెల్ పై కూడా అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ కల్కి చిత్రం ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. ఆగస్టు 22వ తేదీ నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న కల్కి మూవీ ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది.

సరికొత్త రికార్డు సృష్టించిన కల్కి..

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా ప్రపంచ స్థాయి రేంజ్ లో సత్తా చాటింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ అత్యధిక వ్యూస్ రాబట్టి టాప్ లో కొనసాగుతోంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న సినిమాగా కల్కి 2898AD అరుదైన రికార్డును సృష్టించింది. ఫలితంగా గ్లోబల్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో నిలిచింది ఈ సినిమా.

- Advertisement -

ఓటీటీ లో 7.1 మిలియన్ వ్యూస్..

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కల్కి సినిమా ఓటీటీ లోకి రావడం ఆలస్యం, కేవలం రెండు వారాల్లోనే.. 7.1 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది. విడుదలైన మొదటి వారంలోని 2.6 మిలియన్ న్యూస్ సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ వారం అత్యధిక వ్యూస్ రాబట్టింది. అంతేకాదు నాన్ ఇంగ్లీష్ విభాగంలో నెట్ ఫ్లిక్స్ లో మొదటి స్థానంలో నిలిచింది కల్కి.

అసలు కథ అంతా సీక్వెల్ లోనే..

కల్కి మూవీ ను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ భారీ ధరకు కొనుగోలు చేయగా, ఆ ధరకు మించి లాభం లభించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే కల్కి సీక్వెల్ కి సంబంధించి ఇప్పటికే కొంతమేర షూటింగ్ కూడా పూర్తి కాగా.. ఫుల్ లెన్త్ షెడ్యూల్ వచ్చే యేడాది జనవరి నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక అసలు కథ అంతా సీక్వెల్ లోనే ఉంటుందని, ఇక్కడ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి సీక్వెల్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు