Kalki 2898AD Overseas business: రెబల్ స్టార్మ్.. హాలీవుడ్ చిత్రాలను కూడా వెనక్కు నెట్టి..!

Kalki 2898AD Overseas business.. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి మేనియా నడుస్తోందని చెప్పవచ్చు. భారీ అంచనాల మధ్య ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ బడా నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.. అలాగే ప్రభాస్ సరసన దీపికా పదుకొనే , దిశాపటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక జూన్ 27వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేపడుతూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం..

ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ.394 కోట్లు..

Kalki 2898AD Overseas business: Rebel Storm.. pushing back even Hollywood films..!
Kalki 2898AD Overseas business: Rebel Storm.. pushing back even Hollywood films..!

ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ.394 కోట్లు జరిగినట్లు సమాచారం . ఇక ఇది భారతీయ చలన చిత్రంలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక్కరోజులోనే రూ.60 లక్షలు వసూలు..

అసలు విషయంలోకి వెళ్తే..ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 80 కోట్లకు చేరుకుంది.. ఓవర్సీస్ సర్క్యూట్స్ లో ఫ్యూచర్స్టిక్ మూవీకి యుఎస్ఏ మరియు యూఏ ప్రధాన సహకారాన్ని అందిస్తాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక్క డల్లాస్ లోనే కేవలం ఒక్క రోజులోనే $71,353 వసూలు చేసినట్లు సమాచారం.మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.59,62,467.17. అయితే ఇప్పటివరకు ఏ హాలీవుడ్ చిత్రానికి కూడా దక్కని కలెక్షన్స్ కల్కి సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ జరగడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఇండియన్ సినిమానే కాదు హాలీవుడ్ సినిమా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించలేదు.
https://twitter.com/baraju_SuperHit/status/1804777019168919963

- Advertisement -

ఏరియా వైస్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు..

ఇక ఏరియా వైస్ చూసుకుంటే ఒక్క ఆంధ్రాలోనే 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అలాగే నైజాం హక్కులు రూ.70 కోట్లకు, సీడెడ్ హక్కులు రూ.27 కోట్లకు అమ్ముడు పోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనే రూ .182 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

ఇతర రాష్ట్రాల లెక్కలు ఎంతంటే..

ఇంకా ఇతర రాష్ట్రాల విషయానికొస్తే.. కర్ణాటకలో రూ.30 కోట్లు.. కేరళ, తమిళనాడు కలుపుకొని రూ .22 కోట్ల రూపాయల డీల్ ను లాక్ చేసింది.. ఇక నార్త్ ఇండియన్ థియేట్రికల్ బిజినెస్ విలువ 80 కోట్ల రూపాయలు. మొత్తానికి అయితే ఈ సినిమా నుంచీ ప్రపంచవ్యాప్తంగా మినిమం 700 కోట్ల రూపాయలు ఆశిస్తున్నారు మేకర్స్.. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో రూ .394 కోట్లు రాబట్టిన ఈ సినిమా విడుదలైన తర్వాత ఇంతకు డబుల్ రాబడుతుంది అని అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు