Kalki 2898AD: విడుదలకు ముందే విదేశాలకు చెక్కేస్తున్న ప్రభాస్.. ఎందుకంటే..?

Kalki 2898AD.. రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ఇక తర్వాత అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా చిత్రాలే తెరకెక్కిస్తూ భారీ ఇమేజ్ దక్కించుకున్నారు.. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా పేరు దక్కించుకున్న ఈయన.. ఈమధ్య 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరోగా కూడా రికార్డు సృష్టించారు.. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ విదేశాలకు టూర్ వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

విదేశాలకు చెక్కేస్తున్న ప్రభాస్..

Kalki 2898AD: Prabhas is shooting abroad before its release.. because..?
Kalki 2898AD: Prabhas is shooting abroad before its release.. because..?

సాధారణంగా ప్రభాస్ తాను నటించిన సినిమాల విడుదల సమయంలో మాత్రమే విదేశాలకు టూర్ కి వెళ్తూ ఉంటాడు.. కానీ ప్రస్తుతం నటిస్తున్న కల్కి 2898AD చిత్రం ఇంకా విడుదలకు ఐదు రోజుల సమయం ఉన్నప్పటికీ..ముందుగానే ప్రమోషన్స్ లో పాల్గొనకుండా యూరోప్ వెళుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ తర్వాత సినిమాపై హైప్ పెంచడానికి ప్రమోషన్స్ చేపట్టాల్సి ఉంటుంది.. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టేసి వెళ్తున్నారు ప్రభాస్ అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆయన యూరప్ వెళ్ళే ఫోటోలు కెమెరాలో బంధింపబడితే తప్ప అసలు నిజం తెలియదని చెప్పవచ్చు.

ప్రభాస్ కెరియర్..

ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ఈశ్వర్, రాఘవేంద్ర వంటి చిత్రాలతో తొలి ప్రయత్నంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్, ఆ తర్వాత వర్షం , చత్రపతి అంటూ భారీ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక బాహుబలి సినిమా తర్వాత ఈయన రేంజ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత ఈయన నటించిన సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దాంతో ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని ప్రయత్నం చేసిన ప్రభాస్.. సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా ప్రభాస్ కి మంచి విజయాన్ని అందించింది.

- Advertisement -

కల్కి 2898 ఏడి..

ఇక ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో కల్కి 2898 ఏడి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగం కానున్నారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన అమితాబ్ బచ్చన్ లుక్ , కమలహాసన్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పవచ్చు. ఇంకా ఇందులో దీపికా పదుకొనే, దిశాపటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం దీపికా పదుకొనే గర్భవతి అయినా సరే ఈ సినిమా కోసం కష్టపడి మరీ ఈ సినిమా కోసం పని చేస్తోంది. అంతేకాదు ఇందులో ఈమె రియల్ గర్భవతి గానే కనిపించడం ఆశ్చర్యకరమని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు