Kalki 2898Ad: ప్రభాస్ చాలా డేంజర్, కల్కి గురించి దాచిన ప్రతి విషయాన్ని చెప్పేసాడు

Kalki 2898Ad: ప్రస్తుతం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా కల్కి. దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా రేపటికి రిలీజ్ సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇండియన్ సినిమాలో మొదటిసారిగా వస్తున్న మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళు దీనిపైన ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రతి వస్తువును క్రియేట్ చేసుకుంటూ వచ్చింది చిత్ర యూనిట్. అని ఆటోమొబైల్స్ ఇంజనీర్స్ తో చేయి కలిపి బుజ్జి అనే ఒక వెహికల్ ని కూడా తయారు చేశారు.

బుజ్జి అనే పేరు చిన్నది కావచ్చు గాని సినిమాలో బుజ్జి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని నాగ అశ్విన్ ఇదివరకే చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రమోషన్స్ లో కొంత ఈ చిత్ర యూనిట్ వెనుకబడింది అని చెప్పొచ్చు. నేషనల్ మీడియా కి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కానీ తెలుగులో పెద్దగా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. అయితే దీని కారణం ఇప్పుడు రివిల్ అవుతూ వస్తుంది. రీసెంట్ గా ఒక ఫోన్ కాల్ లో ప్రభాస్ తో మాట్లాడాడు నాగ్ అశ్విన్. ఈ ఫోన్ కాల్ లో చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు ప్రభాస్.

Kalki 2898 AD

- Advertisement -

ఇకపోతే ఈ ఫోన్ కాల్ లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు ప్రభాస్. ఈ సినిమాకి సంబంధించి సెకండ్ పార్ట్ కూడా నీ దగ్గర కథ ఉంది అంటూ నాగ్ అశ్విన్ తో అన్నాడు. ఇంకో పది రోజుల్లో దానిపైన కూడా వర్క్ మొదలు పెడతావు అని మాట్లాడేసాడు. దీనితో చాలామందికి కల్కి సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక అసలైన విషయం ఏంటంటే ఇదే కాల్ లో దుల్కర్ సల్మాన్ మరియు విజయ్ కి థాంక్స్ అంటూ డార్లింగ్ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. దీంతో వీరిద్దరు కూడా సినిమాలో కనిపించబోతున్నారని చాలామందికి ఒక క్లారిటీ వచ్చేసింది. కాసేపు ఫోన్ కాల్ లోనే ఇన్ని విషయాలు బయట పెడితే ఇంకా ఇంటర్వ్యూ పెడితే ఎన్ని విషయాలు బయటకు చెబుతాడో అని చాలా జాగ్రత్త పడి కొన్ని విషయాలను దాచి ఉంచింది కల్కి చిత్ర యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు