Kalki 2898AD: ఒక్కో టికెట్ రూ.2,300.. ఎక్కడంటే.. ఆస్తుల అమ్మాల్సిందేనా. ?

Kalki 2898AD..పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ నటించిన తాజా చిత్రాలలో కల్కి 2898AD చిత్రం కూడా ఒకటి.. ఈ చిత్రం సినిమా రేపటి రోజున ప్రపంచవ్యాప్తంగా చాలా భాషలలో విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా..కమలహాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి సెలబ్రిటీలు ఇందులో నటించడం అందరిలో ఆసక్తి కరిపించేలా చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ కథను ఐదేళ్లపాటు కష్టపడి రాశాను అంటూ కూడా తెలియజేశారు. ఇప్పటికే టికెట్లు ఆన్లైన్లో హాట్ కేకుల్లా క్షణాలలో అమ్ముడుపోతున్నాయి.

ముంబై లో ఒక్కో టికెట్ ధర రూ.2,300..

Kalki 2898AD: Rs.2,300 per ticket.. where it is..?
Kalki 2898AD: Rs.2,300 per ticket.. where it is..?

ముఖ్యంగా ఆంధ్ర – తెలంగాణ వంటి ప్రాంతాలలోనే కాకుండా ఈ సినిమా కోసం అభిమానులు దేశవ్యాప్తంగా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. ఇలాంటి సమయంలోనే టికెట్ల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 400 రూపాయల వరకు ఒక్కో టికెట్ ధర పలుకుతోంది.. నిజానికి గత ప్రభుత్వం హయాంలో ఒక్కో టికెట్టు రూ 250 వరకు ధర పలికేది.. కానీ ఈ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు ఆదేశం ఇవ్వడంతో.. ప్రస్తుతం ఒక్కో టికెట్టు 400 రూపాయల వరకు పలుకుతోందని సమాచారం. ఇదిలా వుండగా తాజాగా ముంబై వంటి పరిసర ప్రాంతాలలో INOX లోనీ జియో వరల్డ్ ప్లాజా లో ఒక్కో టికెట్ ధర రూ.2300 వరకు విక్రయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా మరికొన్ని థియేటర్లలో రూ.1,760 వరకు ధరలు ఉండగా మరికొన్నిచోట్ల 1560 రూపాయల వరకు టికెట్లు ధర పలుకుతున్నాయి అయితే అభిమానులు మాత్రం లెక్కచేయకుండా.. టికెట్లు కొనుగోలు చేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ధరలు చూసి కొంతమంది ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కల్కి దెబ్బకు బుక్ మై షో క్రాష్..

మరి ఇంతటి ధరలు పలుకుతున్న కల్కి సినిమా అసలు ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే అన్ని చోట్ల కూడా కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలవ్వడమే కాకుండా క్షణాలలో ఫుల్ అవుతున్నాయి. యూఎస్ఏ వంటి ప్రాంతాలలో కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ.20 కోట్లకు పైగా కలెక్షన్ చేసిందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కల్కి సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. కల్కి సినిమా టికెట్ల దెబ్బకు బుక్ మై షో వెబ్సైట్ ఏకంగా క్రాష్ అయినట్లుగా కూడా తెలుస్తోంది.

- Advertisement -

రికార్డ్స్ బద్దలేనా..?

తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. బాలీవుడ్లో రాజమౌళి RRR , సలార్ చిత్రాల కంటే కల్కి చిత్రానికి ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్ లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. దీంతో అభిమానులు సైతం ప్రభాస్ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎలాంటి రికార్డులను సైతం కల్కి సినిమా బద్దలు కొడుతుందో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు