Kalki 2898AD: తప్పకుండా చూడాల్సిన 10 అంశాలు ఇవే..!

Kalki 2898AD.. 38 సంవత్సరాల వయసులోనే యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా.. దీపికా పదుకొనే, దిశాపటాని హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని రేంజ్ లో హాలీవుడ్ సినిమాలని ఢీ కొట్టింది.. అయితే ఇప్పుడు ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిన పది అంశాలు అంటూ ఒక విషయం తెరపైన ఆసక్తికరంగా మారింది. మరి తప్పకుండా కల్కే సినిమా చూడాలనిపించే ఆ అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Kalki 2898AD: These are the 10 things you must watch..!
Kalki 2898AD: These are the 10 things you must watch..!

శంబల వెనుక కథ..

కల్కి 2898AD సినిమా ట్రైలర్ విడుదలైనప్పటినుండి అందరూ శంబల అంటే ఏంటి? ఆ నగరాన్ని ఎందుకు నిర్మించారు? ఎక్కడ నిర్మించారు? అనే ప్రశ్నలు చాలా మొదలయ్యాయి.. నిజానికి ఈ సినిమా కథ దాదాపు మూడు ప్రపంచాల మధ్య సాగుతుంది..భూ ప్రపంచం అంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో.. కాశీ పట్టణాన్ని చూపించారు.. అన్ని వనరులు ఉండే ఆకాశం కోసం కిలోమీటర్ పరిధిలో కాంప్లెక్స్ డిజైన్ చేశారు.. సర్వ మతాలకు చెందిన శరణార్థులు ఉండే ప్రపంచం గా “శంబల” అనే ప్రాంతాన్ని చూపించారు. దీనిని మొత్తం వీ ఎఫ్ ఎక్స్ లో చూపించడం జరిగింది. దాదాపు ఇందుకోసం 700 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉపయోగించారని ఒక వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది.

కల్కి కోసం భారీ విజువల్ ఎఫెక్ట్ సంస్థలు..

కల్కి సినిమా కోసం ప్రైమ్ ఫోకస్, DNEG, ది ఎంబసీ విజువల్ ఎఫెక్ట్స్ వంటి దిగ్గజ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేశాయి.. ముఖ్యంగా హాలీవుడ్ లో హ్యారీ పోటర్, డ్యూన్, బ్లేడ్ రన్నర్, ఇంటర్ స్టెల్లర్ లాంటి చిత్రాలకు పనిచేసిన టీం కల్కి సినిమా కోసం పనిచేశాయి.

- Advertisement -

బుజ్జి కోసమే రూ .4కోట్లు..

సెట్స్ కోసమే పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం జరిగింది.. ఒక భైరవ ఉపయోగించే వాహనం “బుజ్జి” కోసమే ఏకంగా రూ.4 కోట్లు ఖర్చు పెట్టారట. ముఖ్యంగా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ తో పాటు కోయంబత్తూర్ లోని జయం ఆటో ఇంజనీరింగ్ నిపుణులు సూపర్ కారును రూపొందించారని సమాచారం.

కల్కి 2898AD టైటిల్ అర్థం..

ఈ సినిమాకి కల్కి 2898AD అని టైటిల్ పెట్టడం వెనుక ఒక అద్భుతమైన లాజిక్ ఉందట.. మూవీ ట్రైలర్ ను గమనిస్తే ఒక వ్యక్తి మాట్లాడుతూ..” 6000 సంవత్సరాల కిందట కనిపించింది.. ఇప్పుడు ఆ పవర్ వచ్చిందంటే” అంటాడు కదా..2898 నుంచి ఆరువేల సంవత్సరాలను తీసేస్తే వచ్చేది 3102.. ఇది కృష్ణ పరమాత్మ అవతారం ముగించిన సంవత్సరం .. అంటే 2898 ఏడిలో మళ్ళీ శ్రీమహావిష్ణువు కల్కిగా అవతరించబోతున్నాడు అన్నమాట. 6000 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలను కూడా టైం ట్రావెల్ రూపంలో సినిమాలో అద్భుతంగా చూపించారు..

కల్కి ఎవరు..? హిమాలయాల్లో ఆ రహస్యం ఏమిటి..?

ప్రపంచం అంతమయ్యే సమయంలో శ్రీకృష్ణుడు 10 అవతారాలలో ఒక అవతారంలో వచ్చి ప్రపంచాన్ని కాపాడతారు .. ఇక అలా పది అవతారాలలో ఒక అవతారమే కల్కి. మిగిలిన అవతారాల కంటే ఈ కల్కి అవతారం చాలా భిన్నమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ అవతారం ధర్మం అదుపు తప్పినప్పుడు లేదా కలియుగం చివరిలో రాబోతోంది. ఆ సమయంలో కల్కి వచ్చి తిరిగి ధర్మస్తాపన చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భాగవతంలో కల్కి పురాణంలో కల్కి గురించి ప్రస్తావన ఉంది.

40 ఏళ్ల తర్వాత కలయిక..

కల్కిలో అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్… సుప్రీం యాస్కిన్ గా విలన్ పాత్రలో కమలహాసన్ నటిస్తున్నారు.. వీరిద్దరూ 40 యేళ్ళ తర్వాత మళ్లీ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. 1985 లో వచ్చిన గిరాఫ్తార్ సినిమాలో వీరిద్దరితో పాటు రజనీకాంత్ కూడా నటించారు.

కమలహాసన్ కోసం హాలీవుడ్ మేకప్ నిపుణులు..

ఇందులో సుప్రీం యాస్కిన్ పాత్ర లుక్ కోసం కమల్ హాసన్ కు అనేక టెస్టులు చేశారు.. చివరికి లాస్ ఏంజెల్స్ వెళ్లి హాలీవుడ్ సినిమాలకు పనిచేసే మేకప్ నిపుణులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడం జరిగింది..

మేకప్ కోసం 5 గంటలు..

అశ్వద్ధామ పాత్రలో నటిస్తున్న అమితాబ్ వయసు 81 ఏళ్లు.. కల్కి టీంలో అత్యధిక వయసు కలిగి ఉన్న వ్యక్తి కూడా ఆయనే..అశ్వద్ధామ కు మేకప్ చేయడానికి 3 గంటలు.. తీయడానికి 2 గంటల సమయం పట్టేదట అంతేకాదు ఈ వయసులో యాక్షన్ సీక్వెన్స్ కోసం అమితాబ్ చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు.

దీపిక తొలి తెలుగు చిత్రం..

బాలీవుడ్ , హాలీవుడ్ చిత్రాలతో విశేష ఆదరణ పొందిన దీపికా పదుకొనే మొదటిసారి తెలుగులో నేరుగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే..

అలనాటి తార శోభన..

దాదాపు 18 ఏళ్ల తర్వాత అలనాటి అందాల తార శోభన చేస్తున్న తెలుగు సినిమా… ఇందులో మరియం అనే పాత్రలో శోభన కనిపించారు.

అతిధి పాత్రల్లో యంగ్ స్టార్స్..

ఈ సినిమాలో నాని, మృనాల్ ఠాగూర్ , దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి కొందరు యువ నటులు అతిథి పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచారు.

అలనాటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా..

అలనాటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ సినిమా కోసం పనిచేశారు. ఆదిత్య 369 సినిమాను తెరకెక్కించిన ఈయన ఈ సినిమా కోసం పనిచేయడం జరిగింది. ముఖ్యంగా కల్కి సినిమా కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ కు విలువైన సలహాలు సూచనలు అందించారు.

ప్రత్యేక కెమెరా..

ఈ సినిమా కోసం ఐమాక్స్ డిజిటల్ కెమెరాను ఉపయోగించారు. యారి అలెక్స్ 65, యారి డిఎన్ఏ లెన్స్ ఉపయోగించి 6.5 K రిజల్యూషన్ లో సినిమా తీయడం వల్ల ఐమాక్స్ ఫార్మాట్ కు అప్ స్కేలింగ్ చాలా సులభం అయింది.

ఇక ఇన్ని ప్రత్యేక అంశాలు ఉన్నాయి కాబట్టి.. సినిమాపై అద్భుతమైన ఆసక్తి నెలకొంటోంది.. కచ్చితంగా భారీ అంచనాలను కొల్లగొడుతుందని అభిమానులు సైతం ఊహాగానాలు వ్యక్తం చేస్తుండగా.. ఇటీవల ఓవర్సీస్ లో విడుదలైన ఈ సినిమా ఊహించని టాక్ ను సొంతం చేసుకుంది.. ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందని… ఓవర్సీస్ లో సినిమా చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.. ముఖ్యంగా మహాభారత యుద్ధంతో మొదలయ్యే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది అని నేటిజన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ అంశాల కోసమైనా మీరు కల్కి సినిమాకు బయలుదేరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు