Kalki 2898AD: కల్కి అందుకున్న రేర్ 10 ఫీట్స్ ఇవే..!

Kalki 2898AD.. ప్రభాస్ హీరోగా ప్రముఖ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898AD బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సైతం తిరగరాస్తోంది.. ఇప్పటికే ఈ సినిమా రూ.555 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.. ఈ క్రమంలోనే ఏడాది అత్యధిక వస్తువుల సాధించి తొలిచిత్రంగా నిలిచి పలు రికార్డుల సైతం బద్దలు కొట్టేసింది ఈ సినిమా.. ఈ క్రమంలోనే కల్కి 2898AD అందుకున్న రేర్ 10 ఫీట్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

Kalki 2898AD: These are the rare 10 feats received by Kalki..!
Kalki 2898AD: These are the rare 10 feats received by Kalki..!

1. కల్కి మూవీ అందుకున్న మొదటి ఫీట్.. వీకెండ్ లో అత్యధిక వసూలు రాబట్టిన తొలి చిత్రంగా కల్కి 2898AD నిలిచింది .. ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ రూ.520.79 కోట్లు అందుకొని రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ఆ రికార్డును కల్కి చెరిపివేసింది.

2. అలాగే మలేషియాలో సలార్ పేరు మీద ఉన్న అత్యధిక వసూళ్ళ రికార్డును కూడా కల్కి తమిళ్ వర్షన్ అధిగమించింది. మూడు రోజుల్లోనే రూ .2.2 కోట్లు వసూలు చేసినట్టు మలేషియా టికెట్ ట్రేడ్ అనలిస్టు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఫుల్ రన్ టైంలో ఈ మార్క్ ను అందుకోవడం గమనార్హం

- Advertisement -

3. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అత్యధిక వసూలు సాధించిన టాప్ 3 చిత్రాలు జాబితాలో కల్కి నిలిచింది.. ఆర్ ఆర్ ఆర్ రూ.223 కోట్లు రాబట్టి మొదటి స్థానంలో నిలవగా, బాహుబలి 2 రూ.217 కోట్లు రాబట్టి రెండవ స్థానంలో నిలిచింది.. ఇప్పుడు కల్కి రూ.191.5 కోట్లు వసూలు చేసి మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

4.జర్మనీలో కూడా కల్కి హవా కొనసాగుతోంది. 2024లో అత్యధిక వసూలు రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది.

5. జర్మనీ లో మొదటి వీకెండ్ లో రూ.2.25 కోట్లు రాబట్టి అప్పటి వరకు ఉన్న సలార్, బ్రహ్మస్త్ర, ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసింది.

6. నార్త్ అమెరికాలో మొదటి వీకెండ్ లో 11 మిలియన్ డాలర్లు (రూ.90 కోట్ల) రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.

7. వరల్డ్ బాక్సాఫీస్ ని కూడా కల్కి షేక్ చేస్తోందని చెప్పవచ్చు.. ఇన్సైడ్ ఔట్ -2, ఏ క్వైట్ ప్లేస్.. డే వన్ చిత్రాలకు దీటుగా వసూళ్లు రాబడుతూ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది..

8. ప్రపంచవ్యాప్తంగా ఇన్సైడ్ అవుట్ 2.. మొదటిరోజు వన్ బిలియన్ డాలర్ వసూలు చేయగా..ఏ క్వైట్ ప్లేస్ 98.5 మిలియన్ డాలర్లు, కల్కి 66 మిలియన్ డాలర్లు రాబట్టినట్లు సమాచారం.

9. అంతేకాదు ఏడాది అత్యధిక వసూలు రాబట్టిన తొలి చిత్రం కూడా కల్కి కావడం గమనార్హం. తేజ సజ్జ హనుమాన్ రూ.350 కోట్లు ఫుల్ రన్ టైం రికార్డు బద్దలు కొట్టగా.. ఏడాది తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా కల్కి నిలిచింది..అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.191.5 కోట్లు వసూలు చేసింది.

10. కెనడాలో కూడా అత్యధిక వసూలు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది అని సినీ విశ్లేషకులు రమేష్ బాల ట్వీట్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు