Kalki 2898AD: కల్కి సినిమా ఫైనల్ రన్ టైం ఇదే, ప్రభాస్ అభిమానులకు ఇంకా పండగే

Kalki 2898AD: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా కల్కి. నాగ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కెరియర్ విషయానికొస్తే బాహుబలి సినిమాకు ముందు బాహుబలి సినిమా తర్వాత అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే బాహుబలి సినిమా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది. ఆ తర్వాత ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ఆడియన్స్ అందరం ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే బాహుబలి సినిమా తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ఆ తర్వాత ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ అయింది. మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

కల్కి సినిమా పైనే అంచనాలన్నీ

ఎవడే సుబ్రహ్మణ్యం మహానటివంటి సినిమాలతో దర్శకుడుగా మంచి గుర్తింపును సాధించుకున్నాడు నాగ్ అశ్విన్. మహానటి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది దాదాపు ఆడియన్స్ అంతా థియేటర్స్ కి రావడం మానేశారు అనుకున్న తరుణంలో ఒక బయోపిక్ సినిమాను ఇంత బాగా తెరకెక్కించొచ్చు, ఒక మంచి సినిమా చేస్తే ఆడియన్స్ ఎంత ఆదరిస్తారు అని ప్రాక్టికల్గా నిరూపించాడు నాగ్ అశ్విన్. మహానటి సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక సినిమాను కూడా చేయలేదు ఈ దర్శకుడు. ఇప్పుడు చేస్తున్న కల్కి సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దీని కారణం ఒకటి నాగి సక్సెస్ రేట్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కమలహాసన్, దీపికా పదుకొనే, అమితాబచ్చన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు ఈ సినిమాల్లో నటిస్తున్నారు.

Kalki 2898 AD
కల్కి సినిమా రన్ టైం

ఈ సినిమా మొత్తం నాలుగు పార్ట్స్ లో రానుంది అని కథనాలు వినిపించాయి. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. ఇకపోతే కలిగే సినిమాలో కేవలం 20 నిమిషాలు మాత్రమే కమల్ హాసన్ కనిపిస్తారట. ఇకపోతే ఈ సినిమాలో బుజ్జి అనే ఒక వెహికల్ కీలకపాత్రను పోషించనుంది. చాలామంది ఆటోమొబైల్ ఇంజనీర్స్ తో కలిసి ఈ వెహికల్ ని తయారు చేశారు. ఈ వెహికల్ కోసం గ్రాండ్ ఈవెంట్ ని కూడా చేసింది చిత్ర యూనిట్. ఇకపోతే కల్కి సినిమా రన్ టైం రివిల్ అయింది. ఈ సినిమా రెండు గంటల 50 నిమిషాల వరకు ఉంటుందట. ఈ 27న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇంత రన్ టైం ఉండటం ప్రభాస్ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా ఒక విజువల్ ట్రీట్ గా ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఇదివరకే ఎక్కువ రెంట్ టైం తో వచ్చిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. రంగస్థలం, యానిమల్, మహానటి, అర్జున్ రెడ్డి వంటి సినిమాలు ఎక్కువ రన్ టైం ఉండి మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతకు మించిన స్థాయిలో అవ్వబోతుందని చాలామంది అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు