Kalki 2898AD Ticket Booking: కోలీవుడ్ లో దారుణం.. ఆ తప్పే కారణమా..?

Kalki 2898 AD.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే వార్తలు వినిపిస్తున్నాయి.. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం తెగ సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ.400 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఇక అన్ని రాష్ట్రాలలో కూడా భారీగా టికెట్ బుకింగ్స్ అవుతుంటే.. ఒక తమిళనాడులో మాత్రం చాలా ఘోరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే అక్కడ ఉన్న తెలుగు వారు మాత్రమే ఈ సినిమా పైన ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. దీంతో తమిళనాట సినిమా రైట్స్ కొన్నవారు టెన్షన్ పడుతున్నారు.

తమిళనాట టెన్షన్ మొదలు..

Kalki 2898AD Ticket Booking: Atrocity in Kollywood.. Is that the wrong reason..?
Kalki 2898AD Ticket Booking: Atrocity in Kollywood.. Is that the wrong reason..?

ప్రస్తుతం తమిళంలో ఈ సినిమా హక్కులను శ్రీ లక్ష్మీ మూవీస్ వారు దక్కించుకున్నారు.. అక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.22 కోట్లు షేర్ రాబటాల్సి ఉంటుంది అంటే మినిమం రూ .40 కోట్ల గ్రాస్ రావాలి. ప్రస్తుతం ఉన్న సిచువేషన్ ని బట్టి చూస్తూ ఉంటే పరిస్థితులు కష్టంగా మారాయి.. అయితే సినిమా టాక్ బయటకు వచ్చి పికప్ అయితే బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు..

కమల్ హాసన్ ను హైడ్ చేయడమే ప్రధాన కారణం..

వాస్తవానికి కమల్ హాసన్ సినిమాగా తమిళ్లో దీన్ని చూస్తారని నిర్మాతలు కూడా భావించారు.. అయితే ప్రభాస్ ఇక్కడ హైలెట్ కావడంతో కమల్ ను హైడ్ చేయడం వల్ల ప్రమోషన్ పరంగా కూడా సమస్యలు వస్తున్నాయి. ఇది కొద్దిగా ట్రేడ్ ను భయపెట్టే విషయం గా మారిపోయింది.. అందుకే అక్కడ బుకింగ్స్ కూడా చాలా ఘోరంగా ఉన్నట్లు సమాచారం. పైగా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మాత్రమే ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.. కానీ లోకల్ తమిళులు మాత్రం ఈ సినిమాని పట్టించుకోవడం లేదు ఒక డబ్బింగ్ సినిమా అన్నట్టుగానే ఈ సినిమాను పక్కన పడేస్తున్నారు.. అందులోను ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర కూడా పెద్దగా లేదనే టాక్ కూడా వారిని ఈ సినిమాకి దూరం చేసేలా కనిపిస్తోంది.. పైగా ప్రమోషన్స్ లో కూడా ఈయనను హైలైట్ చేయడం లేదు.. అందుకే హిందీలో వేరే భాషల్లో కలిగి ఉన్న డిమాండ్ తమిళనాడులో అస్సలు కనిపించడం లేదు అని చెప్పవచ్చు. నిన్నటి వరకు ఈ సినిమా ప్రీ సేల్స్ రూ.50 లక్షల గ్రాస్ మాత్రమే కనిపించింది .. కేవలం 15% ఆక్యూపెన్సి ఉంది అంటే ఈ సినిమా ఓపెనింగ్స్ బాగా డల్ గా ఉండబోతున్నాయని చెప్పవచ్చు.

- Advertisement -

కమల్ ను హైలెట్ చేస్తే లెక్క మారవచ్చు..

ఒకవేళ ప్రమోషన్స్ లో ఇప్పటికిప్పుడు కమలహాసన్ ని హైలైట్ చేస్తే ఈ రేంజ్ మారే అవకాశం ఉంది.ఇంకా సినిమాకు ఒక రోజు మిగిలి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మేకర్స్ ఇలాంటి పనులు చేస్తే అక్కడి ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించవచ్చు.. మరోవైపు హిందీ బెల్ట్ కు వచ్చేసరికి బీహార్ , గుజరాత్లలో ఓపెనింగ్స్ అదరగొడుతున్నాయి. కమలహాసన్ వల్ల కోలీవుడ్ లో హైప్ మరింత పెరుగుతుందని నిర్మాతలు భావించారు.. కానీ అదేది ఇక్కడ ఫలించలేదు.. మరి సినిమా రిలీజ్ అయ్యాక సాయంత్రానికైనా కలెక్షన్లు పుంజుకుంటాయని నమ్ముతున్నారు నిర్మాతలు .. మరి నిర్మాతల నమ్మకాన్ని ఈ సినిమా ఏ విధంగా నిలబెడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు