Kalki 2898AD Twitter Review : ‘కల్కి’ హిట్ కొట్టినట్లేనా? సినిమా ఎలా ఉందంటే?

Kalki 2898AD Twitter Review.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన చిత్రం కల్కి 2898AD.. గత రెండు మూడు నెలలుగా సినిమాపై భారీ హైప్ పెంచిన చిత్ర బృందం ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. తాజాగా ఓవర్సీస్ లో సినిమా ప్రదర్శించగా ఆ సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించిన ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లోనే దాదాపు రూ .400 కోట్లు రాబట్టింది.. ఇక రూ.700 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ బరిలో దిగిన ఈ సినిమా విడుదలకు ముందే ఈ రేంజ్ లో వసూలు చేసింది అంటే.. ఇక ఈరోజు సినిమా ఎలా ఉండబోతోంది.. బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో.. ? రికార్డులు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ట్విట్టర్ రివ్యూ..

Kalki 2898AD Twitter Review : Is 'Kalki' a hit? How is the movie?
Kalki 2898AD Twitter Review : Is ‘Kalki’ a hit? How is the movie?

తాజాగా నాలుగున్నర ఏళ్ల నిరీక్షణ తర్వాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే విదేశాలతో పాటు పలుచోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి.. మరి సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ప్రభాస్ బ్లాక్ బస్టర్ కొట్టినట్టే..

ఫస్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అని.. ఇక ఇంటర్వెల్ మెంటల్ లెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఫస్ట్ ఆఫ్ చాలా వరల్డ్ క్లాస్ గా ఉంది.. హాలీవుడ్ లెవెల్ లో చిత్రాన్ని తెరకెక్కించారని.. థియేటర్లో తప్పకుండా చూడాల్సిన సినిమా కథ ఇది.. అలాగే ఇంటర్వెల్ అదిరిపోయింది అని కూడా చెబుతున్నారు.. ప్రతి పది నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ కథ మరింత ముందుకు వెళుతుంది.. నాన్ కల్కి రికార్డ్స్ పక్కా.. నార్త్ వాళ్ళకైతే కేవలం ఫస్ట్ ఆఫ్ చాలు… సెకండ్ హాఫ్ బోనస్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -

విజయ్ దేవరకొండ ఇంట్రో సీన్ మిస్ కావద్దు…

బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్.. తొలి 15 నిమిషాలు అసలు మిస్ కావొద్దు అంటూ.. కీలక పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్ ని కూడా ఇంటర్వెల్లో షేర్ చేశారు అభిమానులు.. ఇక ఇప్పటివరకు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఉన్నాడు అని ఎక్కడ కూడా రివీల్ చేయలేదు చిత్ర బృందం.. కానీ ఒక్కసారిగా అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ ని చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం ఆయన అభిమానులు ఈ సినిమా చూడడానికి క్యూ కడుతున్నారనటంలో సందేహం లేదు.

నాగ్ అశ్విన్ ప్రాణం పెట్టేసారు..

మహాభారతం భాగాన్ని ప్రాణం పెట్టి చేశారు.. అద్భుతమైన విజన్ .. అద్భుతమైన కథ.. నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు.. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. చివరిగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కడికో వెళ్ళిపోతారు.. చిత్ర బృందం రికార్డుల మీద రికార్డులు సాధిస్తుంది అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు.. మొత్తానికైతే ఒక్కొక్కరు ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడమే కాదు.. అత్యుత్సాహంతో సినిమా రివ్యూలు ఇస్తూ అప్పుడే విజయోత్సవంలో మునిగితేలుతున్నారు.. మొత్తానికైతే ప్రభాస్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీలకు మించి రికార్డులు క్రియేట్ చేయబోతున్నారని అయితే స్పష్టంగా తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు