Kalki 2989Ad: కల్కి ఫైనల్ మిక్సింగ్ చేస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి

Kalki 2989Ad: ఊహించడం వేరు ఆ ఊహను వెండితెరపై ఆవిష్కరించడం వేరు చాలామంది కొన్ని కథలను ఊహిస్తారు కానీ ఎస్ఎస్ రాజమౌళి నాగ అశ్విన్ వంటి దర్శకులు మాత్రమే ఆ ఊహను వెండి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాని ప్రపంచ సినిమాకి పరిచయం చేసిన ఘనత ఎస్ఎస్ రాజమౌళికి ఉంది. బాహుబలి సినిమాతో ప్రపంచ సినిమా అంతా ఒక్కసారిగా తెలుగు సినిమా వైపు చూసింది. ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక గౌరవం లభించింది. ఇకపోతే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరూ ఎదురుచూస్తున్న సినిమా కల్కి.

ఈ సినిమా మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో వస్తున్న మొదటి సినిమా. ఈ సినిమాలో పాన్ ఇండియా సార్ ప్రభాస్ నటించిన వలన ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 600 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాను అశ్విని దత్ నిర్మిస్తున్నారు. మహానటి సినిమా తర్వాత నాగి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అమితాబచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ సినిమాలో కనిపించనున్నారు. లేకపోతే ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు సంతోష్ నారాయన్. కల్కి సినిమా కూడా సంతోష్ నారాయన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్లు కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచాయి.

Kalki 2898 AD

- Advertisement -

ఈ సినిమా ఫైనల్ మిక్సింగ్ జరుగుతున్న టైంలో సంతోష్ నారాయణ కలలో నీళ్లు తిరిగాయి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమాకు పని చేయటం తను అదృష్టంగా భావిస్తున్నానని సంతోష్ తన అభిప్రాయాన్ని షేర్ చేశాడు. ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఎంతో క్యూరియాసిటీ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా తెలుగు సినిమా వైపు చూస్తారని చాలామంది అంచనాలు వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు