Kalki: తెలుగు సినిమాకి పూర్వవైభవం, ఇది కదా కోరుకునేది

Kalki: కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతాయి అంటారు. అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు సంభవించాయి. ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని తెలియాలంటే ముందు పేపర్లో న్యూస్ వచ్చేది. ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్లన్నీ అప్పుడప్పుడు పేపర్లో కనిపిస్తూ ఉండేవి. ఇక సినిమా రిలీజ్ కి రెడీ అవుతుందనే టైంలో గోడ మీద పోస్టర్లు కనిపించేవి. ఇదంతా ఒకప్పుడు.

తర్వాత తర్వాత ఆ సినిమాకు సంబంధించిన క్యాసెట్లు వచ్చేవి. ఆ తర్వాత కాలంలో అది కాస్త డివిడిలు, వీసీడీలు రూపంలో వచ్చాయి. ఇప్పుడు ఇంటర్నెట్లో సాంగ్స్ అనేవి ముందు రిలీజ్ అవుతున్నాయి. ఒకప్పుడు ఒకేసారి ఆరు పాటలు వచ్చేవి.కానీ ఇప్పుడు ఒక పాట తర్వాత మరొక పాట రిలీజ్ అవుతూ వస్తుంది.

సినిమా రిలీజ్ కి టైం ఉంది అనగానే ఆడియో రిలీజ్ ని జరిపేవారు. అదే సమయంలో ఆ సినిమాకు సంబంధించిన పాటలన్నీ బయటికి వచ్చేవి. కానీ ఈ మధ్యకాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడం మొదలుపెట్టారు. అంటే సాంగ్స్ ముందుగానే మార్కెట్లోకి వదిలేసి ఒక రెండు మూడు రోజుల్లో సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది అనుకునే టైంలో అతి పెద్ద ఫంక్షన్ చేసి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయటం. ధ్రువ సినిమా నుంచి ఇది మొదలైంది.

- Advertisement -

ఇకపోతే ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్లో పది రోజులు ఆడడమే కష్టం. ఒక సినిమా ఒక మోస్తరుగా ఆడితే అదే సినిమా ఓటీటీ లో 2,3 వారాల్లో దర్శనమిస్తుంది. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా 50, 100 రోజులు ఆడటం అంటే కష్టమని చెప్పాలి. లాస్ట్ టైం రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ సినిమా కొన్ని సెంటర్స్ లో 50 రోజుల వరకు ఆడింది. ఈరోజుల్లో 50 రోజులు పోస్టర్ చూడటం అనేది గగనం అయిపోయింది.

Kalki 2898 AD

ఆ తర్వాత హనుమాన్(Hanuman), గుంటూరు కారం(Guntur Kaaram) వంటి సినిమాలు కొన్ని సెంటర్స్లో 50 రోజులను పూర్తి చేసుకున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా 50 రోజులను పూర్తి చేస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 23న స్ట్రీమింగ్ కి రానుంది. ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ తో పాటు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమా ఇప్పటికే దాదాపు 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదేమైనా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం అనేది తెలుగు సినిమాకి పూర్వ వైభవం తీసుకొచ్చినట్లు అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు