Kalki: కల్కి సినిమాలో అర్జున్ దాస్… ఇది గమనించారా…

Kalki: ప్రస్తుత కాలంలో తెలుగు సినిమా ఏ స్థాయికి వెళ్లిపోయిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి భారీ బడ్జెట్ తో ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచ సినిమా అంతా తెలుగు సినిమా వైపు చూస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. బాహుబలి,పుష్ప, ట్రిపుల్ ఆర్ వంటి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని మార్చేశాయి అని చెప్పొచ్చు.
మరోసారి కల్కి సినిమా వలన తెలుగు సినిమా సత్తా ఏంటో తెలిసి వచ్చింది.

జూన్ 27న రిలీజ్ అయిన కల్కి సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని, కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇండియన్ సినిమా చరిత్రలో వచ్చిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఇది. నాగ్ అశ్విన్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అమితాబచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ తో పాటు ఈ సినిమాలో చాలామంది కనిపించారు. ఇకపోతే ఈ సినిమా నాలుగు భాగాలుగా రానున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా గురించి తప్ప సోషల్ మీడియాలో మరో టాపిక్ లేదు అని చెప్పాలి. అందరూ ఇప్పుడు మహాభారతంలోని కథలను చెబుతూ వస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఒక సినిమా యొక్క స్థాయి ఏంటో శక్తి ఏంటో అర్థం అవుతుంది అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాలు ఎస్ఎస్ రాజమౌళి, రాంగోపాల్ వర్మ, అనుదీప్ కె.వి, దుల్కర్ సల్మాన్ వంటి ఎంతోమంది నటులు కనిపించారు. ఇకపోతే ఈ సినిమాలో అర్జున్ దాస్ పాత్ర కూడా ఉంది అని చెప్పాలి.

- Advertisement -

 Arjun Das

సినిమా చూసిన వాళ్లకి అర్జున్ దాస్ ఎక్కడున్నాడు అనే సందేహం రావచ్చు. అయితే కృష్ణుడు పాత్రకి అర్జున్ దాస్ వాయిస్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే చాలామంది దీనిని గెస్ చేస్తూ వస్తున్నారు కానీ దీని గురించి క్లారిటీ అయితే లేదు. దీని గురించి అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు. కానీ అర్జున్ దాస్ వాయిస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకే చాలా సినిమాల్లో తన పవర్ఫుల్ వాయిస్ తో ఎన్నో ఎలివేషన్స్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఓ జి టీజర్ లో కూడా అర్జున్ దాస్ వాయిస్ వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు