Kalki 2898 AD : కల్కి బంపర్ ఆఫర్… ఇంకా బుక్ చేసుకోలేదా…?

Kalki 2898 AD : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక మరికొందరేమో తమ కుటుంబ సభ్యుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతూ ఉంటారు. అలాంటివారిలో కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ హీరో ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు.

రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి. సినిమాలో హీరోగా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అనంతరం వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇటీవలే ప్రభాస్ నటించిన సలార్ సినిమా మంచి హిట్ అందుకోవడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన తాజా చిత్రం “కల్కి 2898 ఏడి”. రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయింది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో చిత్ర యూనిట్ అంతా బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రభాస్ గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో “కల్కి 2898 ఏడి” సినిమా కథను రూపొందించారు. మైథాలజీకి సైన్స్ ను లింక్ చేస్తూ ఈ సినిమాని రూపొందించారు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు మరణించిన 5వేల ఏళ్ల తర్వాత జరిగే కథ కాబట్టి టైటిల్ లో 2898 ఏడి అనే నెంబర్ ను చేర్చారు. కేవలం టైటిల్ విషయంలోనే కాదు క్యారెక్టర్స్ విషయంలో కూడా రిఫరెన్స్ లో ఉండేలా చూసుకుంటున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగా… కల్కి సినిమా నేపథ్యంలో భైరవ పేరుతో కొత్త టీషర్ట్స్ తీసుకువచ్చింది చిత్రం. అయితే ఈ టీ షర్టులను కొనుగోలు చేసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే… ఈ టీషర్ట్ ల విక్రయాలపై చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. మరో రెండు గంటల్లోనే ఈ టీషర్ట్స్ అయిపోతాయని… వెంటనే బుక్ చేసుకోవాలని సూచించింది. దీంతో… ఈ టి షర్ట్స్ కొనుగోలు చేయాలనుకునేవారు… కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర పేరు భైరవ అని సమాచారం. అందుకే అదే పేరుతో టీ షర్ట్స్‌ తీసుకొచ్చారు.

 

https://x.com/VyjayanthiFilms/status/1805490382228132330

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు