Kalki Cast : వైజయంతి బ్యానర్ అడ్వాన్సులు వీళ్ళ దగ్గర ఉన్నాయా.?

Kalki Cast: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో వైజయంతి బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు నిర్మాత అశ్వని దత్. అయితే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలోని నిర్మించిన ఈ సంస్థ ఒక టైం లో భారీ నష్టాలను చవిచూసి ఉంది. దాదాపు ఒక సినిమాతో కొన్నేళ్లపాటు సినిమాలు ఆపేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. మెహర్ రమేష్ దర్శకుడిగా చేసిన శక్తి సినిమాను వైజయంతి బ్యానర్ పై నిర్మించారు అశ్విని దత్. అయితే తనకు తెలిసిన ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఈ సినిమా వర్కౌట్ కాదు అందాకి సినిమాలు తీయడం మానేయండి ప్రస్తుతం మీ టైం బాలేదు అని చెప్పినా కూడా వినకుండా ఆ సినిమాను నిర్మించాడు. అయితే ఆ సినిమా భారీ నష్టాలను చవిచూసింది.

ఇంకా కొన్ని రోజులు పాటు సినిమాలు ఆపేద్దాం అనుకున్న టైంలో నాగ్ అశ్విన్ చెప్పిన ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో మళ్లీ సినిమాలు మొదలుపెట్టారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు వైజయంతి బ్యానర్ మరియు స్వప్న సినిమాస్. ఈ బ్యానర్ కి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. నాగ అశ్విన్ రావడం తర్వాత ఈ బ్యానర్ కి అన్ని బాగానే కలిసి వస్తున్నాయి.

Kalki 2898 AD

- Advertisement -

ఈ బ్యానర్ లో వచ్చిన సినిమా కల్కి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా కొంతమందికి అక్కడక్కడ బోర్ ఫీల్ కూడా వచ్చింది అని చెప్పాలి. ఈ సినిమాలో చాలావరకు కొన్ని పాత్రలు అనవసరంగా ఉన్నాయి అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ, రాజమౌళి, అనుదీప్ , ఫరియా అబ్దుల్లా, దుల్కర్ సల్మాన్ వంటి వాళ్లు ఈ సినిమాలో కనిపిస్తారు. అంతగా ప్రాముఖ్యత లేకపోయినా కూడా ఈ పాత్రలను పెట్టడానికి కారణం ఏమిటి అని సరదాగా సోషల్ మీడియాలో టాపిక్ నడుస్తున్నాయి. వైజయంతి బ్యానర్ అడ్వాన్స్ లు వీరి దగ్గర ఉన్నాయేమో అందుకే వీళ్ళందర్నీ కూడా అక్కడక్కడ నాగ్ అశ్విన్ పెట్టాడు అని కామెంట్ వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు