Kalki Collections : కలెక్షన్స్‌లో ఫ్యాన్సీ నెంబర్… వచ్చిందా.. వేసుకున్నారా…?

Kalki Collections : కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూసిన సినిమా కల్కి. ఈ సినిమాను గత నాలుగు సంవత్సరాలుగా తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఈ సినిమాను అశ్విన్ దత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఫస్ట్ డే దాదాపు 191 కోట్లు ఈ సినిమాకు వచ్చాయి.

ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ దీపికా పదుకొనే కమలహాసన్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. వీళ్లే కాకుండా చాలామంది దర్శకులు కూడా ఈ సినిమాలో కొన్ని పాత్రల్లో కనిపించారు. అయితే అవి సినిమాకి పెద్దగా ఉపయోగపడకపోయినా కూడా చూసిన ఆడియన్స్ కి కొంచెం థ్రిల్ ఫీల్ కలిగించాయి. సంతోష్ నారాయణ ఈ సినిమాకి సంగీతం అందించాడు. సినిమాకి సంగీతం అందించడంతోపాటు అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ని కూడా అందించాడు.

ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు ఎక్కువ చోట్ల హౌస్ ఫుల్ గా మారి కాసుల వర్షం కురిపించింది. దాదాపు 191 కోట్లు ఈ సినిమాకి మొదటి రోజు వచ్చాయి. సెకండ్ డే కి ఈ సినిమా కలెక్షన్స్ తగ్గింది కేవలం 149 కోట్లు మాత్రమే ఈ సినిమాకి వచ్చాయి. మామూలుగా చాలా చిన్న సినిమాలకు మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువగా వచ్చి థియేటర్ నిండుతాయి. కానీ కల్కి సినిమాకి సంబంధించి దాదాపు 50 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ తగ్గే పరిస్థితి వచ్చింది.

- Advertisement -

Kalki Collections

ఇక తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వలన కలెక్షన్స్ కొంత తగ్గాయి. ఇక తాజాగా మరో కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే అనూహ్యంగా ఈ సినిమా కలెక్షన్స్ 555 కోట్లు వచ్చినట్లు రీవిల్ చేశారు. అయితే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నింపటానికి ఫాన్సీ నెంబర్ వేశారా .? లేకపోతే యాదృచ్ఛికంగా నిజంగా అన్ని కోట్లు వచ్చాయనేది ఆలోచించాల్సిన విషయం. దీనిపైన సోషల్ మీడియాలో కొన్నిచోట్ల భిన్నమైన అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు