Kalki Day 2 Collections : అనుకున్నది ఒకటి… అయినది మరొకటి – పూర్తిగా పడిపోయిన కల్కి కలెక్షన్లు

Kalki Day 2 Collections : కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూసిన సినిమా కల్కి. ఈ సినిమాను గత నాలుగు సంవత్సరాలుగా తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఈ సినిమాను అశ్విన్ దత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపు 191 కోట్లు ఈ సినిమాకు వచ్చాయి.

ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ దీపికా పదుకొనే కమలహాసన్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. వీళ్లే కాకుండా చాలామంది దర్శకులు కూడా ఈ సినిమాలో కొన్ని పాత్రల్లో కనిపించారు. అయితే అవి సినిమాకి పెద్దగా ఉపయోగపడకపోయినా కూడా చూసిన ఆడియన్స్ కి కొంచెం థ్రిల్ ఫీల్ కలిగించాయి. సంతోష్ నారాయణ ఈ సినిమాకి సంగీతం అందించాడు. సినిమాకి సంగీతం అందించడంతోపాటు అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ని కూడా అందించాడు.

Kalki 2898 AD

- Advertisement -

ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు ఎక్కువ చోట్ల హౌస్ ఫుల్ గా మారి కాసుల వర్షం కురిపించింది. దాదాపు 191 కోట్లు ఈ సినిమాకి మొదటి రోజు వచ్చాయి. లేకపోతే సెకండ్ డే కి ఈ సినిమా కలెక్షన్స్ తగ్గినట్లు సమాచారం వినిపిస్తుంది కేవలం 107 కోట్లు మాత్రమే ఈ సినిమాకి వచ్చాయి.  మామూలుగా చాలా చిన్న సినిమాలకు మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువగా వచ్చి థియేటర్ నిండుతాయి.

కానీ కల్కి సినిమాకి సంబంధించి దాదాపు 80 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ తగ్గాయి. అయితే ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చి కూడా కలెక్షన్ తగ్గాయి. అంటే ఈ సినిమా అంతగా ఎక్కలేదు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఈ సినిమాని ఒక హైప్ తో లేపుతున్నారు. ఏదేమైనా మెల్లగా మౌత్ టాక్ తో ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు