Kalki Collections : ఇలా అయితే కష్టం గురు… లక్ష్యాన్ని చేరడం డౌటే !

Kalki Collections : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో అశ్వని దత్ ఒకరు. ఎదురులేని మనిషి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగులు వేశారు. ఆ తర్వాత యుగపురుషుడు,గురు శిష్యులు, అడవి సింహాలు, అగ్నిపర్వతం, ఆఖరిపోరాటం వంటి ఎన్నో సినిమాలు చేశాడు. అయితే అశ్విని దత్ కి మంచి పేరును తీసుకొచ్చిన సినిమా మాత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ వైజయంతి బ్యానర్స్ లో వచ్చిన ప్రతిష్టాత్మకమైన సినిమాల ప్రస్తావన వస్తే మొదటి ఈ సినిమా పేరు వినిపిస్తుంది.

వరుసగా సినిమాలు నిర్మిస్తున్న టైంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన శక్తి సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అక్కడితో అశ్విని దత్ పని దాదాపుగా అయిపోయింది అని అందరు అనుకున్నారు. ఆ సినిమా తర్వాత సినిమాలు తీయడం ఆపేద్దాం అనుకున్న తరుణంలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాను తెరకెక్కించారు ఈ సంస్థ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు తీసుకొచ్చింది. ఈ సినిమా దర్శకుడు ఏకంగా అశ్విని దత్ కి అల్లుడైపోయాడు.

ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన రెండవ చిత్రం మహానటి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను వసూలు చేసింది ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి హిట్ అయింది. దాదాపు థియేటర్ కి ప్రేక్షకులు రావడం మానేశారు అనుకునే తరుణంలో ఒక గొప్ప సినిమా తీస్తే సినిమాను వెతుక్కుంటూ థియేటర్ కి వస్తారు అని నిరూపించాడు దర్శకుడు. లేకపోతే రీసెట్ గా నాగ్ అశ్విన్ కరెక్ట్ ఎక్కించిన సినిమా కల్కి. జూన్ 27న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన ఈ సినిమా నేటికీ దాదాపు 825 కోట్లకు పైగా వసూలు చేసింది.

- Advertisement -

Kalki 2898 AD

మామూలుగా కల్కి సినిమాకు ఫస్ట్ డే వసూళ్లు 191 కోట్లు వచ్చాయి. అయితే ఈ వసూళ్లు చూసి అతి త్వరలో ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుంది అని అందరూ ఊహించారు. కానీ దాదాపు వారం రోజులు కావస్తున్న కూడా నేటికీ 825 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 1000 కోట్లు చాలా త్వరగా వచ్చేస్తాయి అనుకున్న ఈ సినిమాకి ఇంత స్లోగా కలెక్షన్స్ కొద్దిపాటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అశ్వినీ దత్ ఈ సినిమా కోసం దాదాపు 700 కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్టు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇలా అయితే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు