Kalki2898AD : కల్కి మేకర్స్ పై లీగల్ నోటీసులు జారీ… మనోభావాలు కించపరిచారంటూ!

Kalki2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల ప్రభంజనం కంటిన్యూ చేస్తుంది. ఇప్పటికే 1000 కోట్ల వసూళ్లను అందుకున్న ఈ చిత్రం మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే దిశగా ముందుకు దూసుకుపోతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఎక్స్ట్రార్డినరీ స్క్రీన్ ప్రెజెన్స్ కి తోడు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ల పెర్ఫార్మన్స్ సినిమాకి ప్లస్ అయింది. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్‌ తన దర్శకత్వ ప్రతిభతో సినిమాని ముందుకు నడిపించాడు. ఇక ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులతో పాటు, పలువురు సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా కల్కి చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే విమర్శలు కూడా వచ్చినా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా ఒక మత బోధకుడు కల్కి మేకర్స్‌ పై ఏకంగా లీగల్ నోటీసులు జారీ చేశాడు.

Kalki Dham chairman issued legal notices on the makers of Kalki2898AD

మనోభావాలు కించపరిచారు – ఆచార్య ప్రమోద్ కృష్ణం

తాజాగా కల్కి (Kalki2898AD) మేకర్స్ పై ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన శ్రీ ‘కల్కి ధామ్‌’ లోని కల్కి పీఠాధీశ్వరుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం కల్కి2898AD సినిమా మేకర్స్ కి లీగల్ నోటీసులు జారీచేశాడు. కల్కి చిత్ర నిర్మాతలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కల్కి సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, పవిత్ర గ్రంథాలలో వివరించిన విధంగా కాకుండా, దేవతల ప్రాతినిధ్యాన్ని, అలాగే పురాణ పురుషుల పాత్రలను ఈ చిత్ర యూనిట్ వక్రీకరించిందని ఆయన వాదించాడు. అలాగే ఈ చిత్రంలో కల్కి భగవానుడి గురించిన ప్రాథమిక భావనను మార్చారని, హిందూ గ్రంధాలలో వ్రాసిన మరియు వివరించిన దానికి విరుద్ధంగా ఉందని, భగవాన్ కల్కి కథ యొక్క చిత్రణ మరియు వర్ణన పూర్తిగా సరికానిది, మరియు కోట్లాది మంది హిందువులు మరియు కల్కి అనుచరుల మత విశ్వాసాలకు కేంద్రంగా ఉన్న పవిత్ర గ్రంథాలను చిత్ర యూనిట్ అవమానిస్తుంది అని ఆచార్య ప్రమోద్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

15 రోజుల్లో అంతా పరిష్కరించాలి..

ఇక కల్కి ధామ్ పీఠాథిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం కల్కి చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేస్తూ, ఈ చిత్ర నిర్మాతలు మరో 15 రోజుల్లోగా తమ ఆరోపణల గురించి సంజాయిషి ఇవ్వాలని, సినిమాలో చేసిన తప్పులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే వారిపై సివిల్ మరియు క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఇంతకు ముందు కూడా కొంతమంది ఇలా చిత్ర యూనిట్ పై విమర్శించినా కేసు పెట్టడం వరకూ పోలేదు. మరి కల్కి2898AD మూవీ దర్శకనిర్మాతలు ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు