Kalki2898 AD : ‘కల్కి’ మేనియా.. బాలీవుడ్ సినిమాలు పరార్..

Kalki2898 AD : ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కల్కి.. ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్, లెజండరి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ కల్కి 2898 ఏడి. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొనే, దిశా పటాని వంటి స్టార్ హీరోయిన్లు ఇందులో ప్రత్యేక పాత్రల్లో నటించారు.. జూన్ 27న రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర ర్యాంప్ ఆడేస్తుంది..

అక్కడ కూడా భారీ కలెక్షన్స్ ను అందుకుంటుంది.. ఈ సినిమా దెబ్బకు మిగిలిన హీరోలు సైలెంట్ అయినట్లు తెలుస్తుంది.. ఈ సినిమా ఎఫెక్ట్ వల్ల బాలీవుడ్ లో నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న సినిమాలు మూడు విడుదలను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.. కల్కి కి వస్తున్న పాజిటివ్ టాక్ తో పాటు కలెక్షన్ల సునామిని చూసి ఓ స్టార్ హీరో తన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.. ఆ హీరో మరెవ్వరో కాదు అజయ్ దేవగన్.. ఈయన టబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘ ఔరోన్ మెయిన్ కహన్ దుం తా ‘. ఈ సినిమాను మొదట కల్కి రిలీజైన వారం తర్వాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించారు.. ఫ్రైడే ఫిలిం వర్క్స్, ఎన్ హెచ్ స్టూడియోజ్ ఈ సినిమాను నిర్మించారు..

Kalki Effect Bollywood Movies Postponed Release Dates
Kalki Effect Bollywood Movies Postponed Release Dates

కానీ ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.. కల్కి ఎఫెక్ట్ ఇండస్ట్రీలో బాగా పడుతుంది.. ఈ సినిమా దెబ్బతో మిగిలిన వాయిదా కావాల్సిన సినిమాలు సైతం విడుదల తేదీలను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.. ఇక కల్కి సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇక కలెక్షన్స్ కూడా ఓ రేంజులో రాబడుతుంది.. 5 రోజులకు దాదాపు 800 ల కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది.. మరో రెండు, మూడు రోజుల్లోనే 1000 కోట్లు క్రాస్ చెయ్యడం పక్కా అని ఫ్యాన్స్ సంబరిపడిపోతున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు