Kalki Event : అర్రె… దీపికాతో అమితాబ్ భలే దొరికాడే

Kalki Event : కల్కి 2898 ఏడి అనే సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో దీపికా పదుకొనేతో పాటు ప్రభాస్, అమితాబ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాకుండా వేదికపై జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ను చూసి దీపికతో అమితా భలే దొరికిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇంతకీ బిగ్ బీ చేసిన ఆ పనేంటో తెలుసుకుందాం పదండి.

దొరికిపోయిన అమితాబ్…

కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ డార్క్ థీమ్ లో కనిపించారు. దాదాపు కల్కి సినిమాలో నటించిన స్టార్స్ అందరూ బ్లాక్ కలర్ డ్రెస్ లోనే దర్శనం ఇచ్చారు. ఇక దీపికా పదుకొనే కూడా నలుపు రంగు దుస్తులను ధరించి బేబీ బంప్ తో స్టైలిష్ గా కనిపించింది. అయితే వేదిక పైకి దీపికను ఆహ్వానించినప్పుడు ప్రభాస్ ఆమెను చేయి పట్టుకుని మెట్లు ఎక్కి రావడానికి హెల్ప్ చేయాలని చూశాడు. వెంటనే అమితాబ్ వచ్చి ప్రభాస్ చేసిన పనిపై జోక్ వేస్తూ ఆటపట్టించినట్టు కనిపించింది. అయితే నిజానికి ప్రభాస్ కంటే ముందు అమితాబ్ దీపికాకు హెల్ప్ చేస్తూ కనిపించారు. ఆయన ముందు దీపికాకు చేయి అందించగా, ఆ తర్వాత ప్రభాస్ హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు. దీంతో ప్రభాస్ హెల్ప్ చేస్తే అమితాబ్ జోక్ చేశాడు గానీ ముందుగా ఆయనే హెల్ప్ చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ముంబైలో జరిగిన ఈవెంట్ తో సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి మూవీ గురించే చర్చ నడుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో మొత్తం కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈవెంట్లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏమిటంటే రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరించడం. మరి జూన్ 27న పాన్ ఇండియా మూవీగా థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

kalki-event-amitabh-bachchan-made-fun-with-prabhas-and-deepika-at-kalki-pre-release-event

కల్కి కోసం బయటకొచ్చిన దీపికా

దీపికా పడుకొనే ప్రెగ్నెంట్ అని ప్రకటించినప్పటి నుంచి బయట కన్పించడం మానేసింది. వరుసగా ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా ఓటు వేయడానికి మాత్రమే ఆమె బయటకు వచ్చింది. ఇప్పుడు కల్కి కోసం. దీంతో దీపికాకు సంబంధించిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

మూడో సినిమాకే పాన్ ఇండియా డైరెక్టర్

ఎవడే సుబ్రమణ్యం, మహానటి తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్‌కి కల్కి 2898 ఏడీ మూడవ చిత్రం కావడం విశేషం. ఆయన మూడు సినిమాలను కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్వప్న దత్, అశ్విని సి. దత్ నిర్మించారు. మొత్తానికి మూడవ సినిమాతోనే నాగ్ పాన్ ఇండియా దర్శకుడిగా మారడం విశేషం.

కల్కి చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్‌లతో పాటు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, డిజోర్డ్జే ఎస్. సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. కల్కి 2898 ఏడీ జూన్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు