Kalki: సందీప్ రెడ్డి వంగను నాగ్ అశ్విన్ టార్గెట్ చేస్తున్నాడా.? అనుమానాలు రేకెత్తిస్తున్న ఇంస్టాగ్రామ్ స్టోరీ…

Kalki: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమాకి 100 కోట్లు కలెక్షన్స్ రావాలి అంటేనే గగనంలా అనిపించేది. అక్కడినుంచి తెలుగు సినిమా నేడు 1000 కోట్లు వసూలు చేసే రేంజ్ కు ఎదిగింది. మొదటిసారి పవన్ కళ్యాణ్ చేసిన అత్తారింటికి దారేది సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ను వసూలు చేసింది. ఆ తరువాత బాహుబలి సినిమాకి సంబంధించి 200 కోట్లు బడ్జెట్ అని అనౌన్స్ చేసినప్పుడు ప్రభాస్ కు అంత మార్కెట్ కూడా లేదు ఎలా రికవరీ అవుతున్నాయి అనుకున్నారంతా. కానీ ఊహించని విధంగా కేవలం తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది బాహుబలి సినిమా.

Kalki 2898 AD 1000 crore

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలయ్యాయి. అయితే బాహుబలి తర్వాత ఒక మూడు సినిమాలు ప్రభాస్ కి వరుసగా నిరాశను మిగులుతాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సింహ కొంత ఉపశమనం కలిగించి కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇకపోతే ప్రభాస్ రీసెంట్ గా నటించిన సినిమా కల్కి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అద్భుతమైన కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు అధికారికంగా కూడా చిత్ర యూనిట్ ప్రకటించి, ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు.

- Advertisement -

మూడు 1000 కోట్ల సినిమాలు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ మూడు సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాయి. వాటిలో రెండు ప్రభాస్ నటించిన సినిమాలే ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా కూడా 1000 కోట్లు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. కల్కి సినిమా 1000 కోట్లు వసూలు చేసిన సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంస్టాగ్రామ్ వేదిక ఒక స్టోరీని పోస్ట్ చేశాను. ఈ 1000 కోట్లు నెంబర్ అనేది మాలాంటి యంగ్ ఫిలిం మేకర్స్ కి ఒక మైల్ స్టోన్. ఎటువంటి రక్తపాతం, గంభీరత, అశ్లీలత, రెచ్చగొట్టే లేదా దోపిడీ కంటెంట్ లేకుండానే మేము దీనిని సాధించాము అంటే ప్రేక్షకులకు మరియు మా వెనుక నిలిచిన నటీనటులకు చాలా… చాలా ధన్యవాదాలు. అంటూ పోస్ట్ చేశాడు నాగ్ అశ్విన్.

Animal

ఇకపోతే సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ సినిమా కూడా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా ఆ సినిమా ఎంత వైలెంట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమాని దృష్టిలో పెట్టుకొని నాగ్ అశ్విన్ ఇలాంటి కామెంట్స్ చేశాడు అని సోషల్ మీడియా వేదికగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి నాగ్ అశ్విన్ కి సందీప్ రెడ్డి వంగకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మహానటి సినిమాలో ఒక పాత్రలో కూడా కనిపించాడు సందీప్ రెడ్డి వంగ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు