Kalki Movie Collections: అవి కల్కి కి వచ్చిన కలెక్షన్సా లేదా, కావాలని మాజీ సీఎంని ట్రోల్ చేస్తున్నారా.?

Kalki Movie Collections: కాలం ఎప్పుడూ ఎవరిని ఎలా నిర్ణయిస్తుందో ఎవరు ఊహించలేరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు మధ్య కొన్ని రోజుల క్రితం వరకు ఎన్నో విభేదాలు ఉండేవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడం. అక్కడ అధికార పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీని క్వశ్చన్ చేయటం వలన పవన్ కళ్యాణ్ ని పర్సనల్గా టార్గెట్ చేసింది అప్పుడు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలు సినిమా టికెట్ రేట్లు తగ్గించడం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను అక్కడ నిలబెట్టడం వంటి పనులు చేసేది. అయితే సినిమా టిక్కెట్ రేటు విషయంలో మెగాస్టార్ చిరంజీవి కొంతమంది స్టార్ హీరోలతో పాటు వెళ్లి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. టికెట్ రేట్లు పెంచమని అడుగుతూ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను చెప్పుకున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నూ జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేయలేదు. అందులో సురేష్ బాబు, అశ్విని దత్ లాంటి పెద్ద వ్యక్తులు ఉన్నారు.

నీకు తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో అశ్వినీ దత్ ఒకరు. అశ్విని దత్ కు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది కచ్చితంగా 160 సీట్లు వస్తాయి అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు అశ్విని దత్. మొత్తానికి అదే జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు సీఎం కావడం వలన ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు కూడా పెరిగాయి. అశ్విని దత్ నిర్మించిన కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ డే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది.

Kalki Movie Collections

- Advertisement -

ఇకపోతే కల్కి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 191 కోట్లు వచ్చాయి. అయితే ఈ 191 కోట్లు అనేది ఆశ్చర్యకరంగా వచ్చాయి అని చెప్పొచ్చు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే 1+9+1= 11 అవుతుంది. అంటే వైయస్సార్సీపి ప్రభుత్వానికి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి అని సింబాలిక్ గా ఈ కలెక్షన్స్ను అనౌన్స్ చేశారా. లేకపోతే ఈ కలెక్షన్స్ నిజంగానే వచ్చాయా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా మొదలయ్యాయి. ఏదేమైనా ఇది కో ఇన్సిడెన్సో లేకపోతే జగన్ పైన ట్రోలింగ్ అనేది అర్థం కాని విషయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు