Kalki Movie : కల్కి సినిమా హిట్ అవ్వదు ప్రభాస్ జాతకం ఇంకో రెండేళ్లు ఇంతే… ప్రముఖ జ్యోతిష్యుడు

Kalki Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు తెలుగులో మాత్రమే క్రేజ్ సంపాదించిన ఈ హీరో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించాడు. బాహుబలి సినిమా తర్వాత రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ అయింది. అయితే బాహుబలి సినిమా తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన కూడా ఆ సినిమాలకు సంబంధించి మినిమం కలెక్షన్స్ అయితే వచ్చాయి అని చెప్పొచ్చు. ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా మంచి హిట్ అయింది. ప్రభాస్కి పర్ఫెక్ట్ కం బ్యాక్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

Kalki 2898 AD

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా కల్కి ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా హాలీవుడ్ ని తలపించేలా ఉంది అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ప్రపంచ సినిమా అంతా తెలుగు సినిమా పరిశ్రమ వైపు తిరిగి చూడబోతుంది. అనేంతల ఈ సినిమాను డిజైన్ చేశాడు నాగ అశ్విన్. ఇకపోతే ఈ సినిమా నుంచి రీసెట్ గా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణ కంపోజ్ చేసిన ఈ సాంగ్ అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించుకుంది. ఇకపోతే జూన్ 27న కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఈ సినిమాలో కనిపించనుంది.

- Advertisement -

ఇకపోతే కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తరుణంలో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు పండిత్ జగన్నాధ్ గురూజీ ఈ సినిమా గురించి సంచలమైన వ్యాఖ్యలు చేశారు. కల్కి సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో హిట్ అవ్వదని, కానీ ఈ సినిమాకి రావాల్సిన కలెక్షన్స్ మాత్రం మినిమం వస్తాయని. సినిమా బడ్జెట్ గ్యారంటీగా రికవరీ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అలానే ప్రభాస్ జాతకంలో రెండేళ్ల పాటు స్ట్రగుల్స్ ఉన్నాయి అంటూ మరో విషయాన్ని చెప్పాడు. అయితే ఇదే మాదిరిగా తెలుగులో కూడా ఒక ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అప్పట్లో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అవన్నీ కూడా తారుమారయ్యాయి. ప్రస్తుతం కొంతమంది పండి జగన్నాథ్ గురూజీ ఫేమస్ అవ్వడానికి నోటికి వచ్చింది చెబుతున్నాడు అంటూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు