Kalki: ప్రోమోషన్స్ షురూ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంక పండగే

Kalki: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరు ఎదురుచూస్తున్న సినిమా కల్కి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమా లేవి అంతగా ఆకట్టుకోలేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ లో రాబట్టింది.

అంచనాలన్నీ కల్కి సినిమా పైన

కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా, ఎంతోమంది వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ఈ కల్కి. ఈ సినిమాలో ప్రభాస్ తో జంటగా దీపికా పదుకొనే కనిపించడం ఉంది. కమలహాసన్, అమితాబచ్చన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు సినిమాలు నటించనున్నారు. అయితే ఈ సినిమాలో కమలహాసన్ పాత్ర కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సెకండ్ పార్ట్ లో దాదాపు 90 నిమిషాల వరకు కమలహాసన్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.

Kalki

- Advertisement -

కల్కి సినిమా నుంచి బుజ్జి పరిచయం

కల్కి సినిమాకి సంబంధించి స్క్రాచ్ వీడియో అంటూ పార్ట్ పార్ట్ లుగా వీడియోలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే రీసెంట్ గా కూడా బుజ్జిని పరిచయం చేస్తున్నామంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో కి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ను వాడారు. ఇకపోతే బుజ్జిని రేపు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రామోజీ ఫిలిం సిటీ లో రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈవెంట్ కి ఎంట్రీ పాస్ తప్పనిసరిగా ఉండాలి అని రిలీజ్ చేసిన పోస్టర్లో తెలిపారు. ఇకపోతే ఈ సినిమా టీం ఫస్ట్ టైం పబ్లిక్ తో ఇంట్రాక్ట్ అవుతుంది. ఈ సినిమా ప్రోమోషన్స్ ఇక్కడి నుంచి మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు