Kalki: రాజశేఖర్ కు షాక్ ఇచ్చిన బుక్ మై షో… పాపం ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దు…

Kalki: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ హీరోస్ లో రాజశేఖర్ ఒకరు. ఒకప్పుడు రాజశేఖర్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ మంచి ఆదరణ చూపించే వాళ్ళు. కానీ ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్కు రావడం తగ్గించారు కాబట్టి రాజశేఖర్ నటిస్తున్న సినిమాలకు కొంతకాలం పాటు సరైన ఆదరణ లభించలేదు. వరుసగా డిజాస్టర్ సినిమాలు రాజశేఖర్ కెరియర్ లో పడ్డాయి. అయితే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన గరుడవేగ సినిమా మంచి హిట్ అయి రాజశేఖర్ ను మళ్లీ హిట్ ట్రాక్ లో నిలబెట్టింది. ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి.

ఆ సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా చాలామంది విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుని కొంతమేరకు బాగానే ఆడింది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు ఆ సినిమా వెలుగులోకి రావడానికి కారణం ఏంటి అంటే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది.

Kalki 2898 AD

- Advertisement -

ఈ సందర్భంగా ఈ సినిమా టికెట్లను కూడా ఆన్లైన్లో విడుదల చేశారు. అయితే ఇదే సందర్భంగా రాజశేఖర్ నటించిన కల్కి సినిమా కూడా రీ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వాటి టికెట్లను కూడా ఆన్లైన్ లో పెట్టారు. అయితే ప్రభాస్ కల్కి సినిమా అనుకుని చాలామంది రాజశేఖర్ కల్కి సినిమాకు టికెట్లు బుక్ చేసుకున్నారు. దీనితో రాజశేఖర్ కల్కి టీం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ తరుణంలోని బుక్ మై షో ఆప్ ఒక ట్విస్ట్ ఇచ్చింది. రాజశేఖర్ కల్కి సినిమాకు బుక్ చేసుకున్న టిక్కెట్లు అన్నిటిని కూడా ప్రభాస్ కల్కి సినిమాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది. అయితే అంతలోనే ఎంతో ఆనందపడిన రాజశేఖర్ కల్కి టీం కి ఇప్పుడు నిరాశ ఎదురవుతుంది. ప్రభాస్ కల్కి సినిమా టికెట్లు బుకింగ్ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదు అని రాజశేఖర్ కూడా స్పందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు