Kalki shows Cancel : ఆ ధియేటర్లో కల్కి షోస్ క్యాన్సిల్… ప్రేక్షకులు ఫైర్

Kalki shows Cancel : దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ని కల్కి 2898 ఏడీ మేనియా ఊపేస్తుంటే, మరోవైపు ఓ థియేటర్ యాజమాన్యం మాత్రం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. రికార్డ్ స్థాయిలో కల్కి మూవీకి టికెట్ బుకింగ్స్ జరిగిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఓ థియేటర్లో కల్కి షోను క్యాన్సిల్ చేసినట్టుగా సమాచారం. మరి ఎందుకిలా చేశారో తెలుసుకుందాం పదండి.

ఆ థియేటర్లో కల్కి షోలు క్యాన్సిల్…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి. చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి మూవీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటికే సినిమాను చూసిన ఆడియన్స్ మూవీ విజువల్ ఫీస్ట్ అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే ఓ థియేటర్ యాజమాన్యం మాత్రం ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న ప్రేక్షకులకు షోలు క్యాన్సిల్ చేసి షాక్ ఇచ్చింది.

పూణేలోని ఐమాక్స్ థియేటర్లో కల్కి షో క్యాన్సిల్ అయినట్టుగా సమాచారం. దీంతో ఆల్రెడీ బుక్ చేసుకున్న షోను క్యాన్సిల్ చేయడం ఏంటని ప్రేక్షకులు సదరు థియేటర్ యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా పరిహారంగా తమ డబ్బులు తిరిగి చెల్లించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సదరు థియేటర్లో అసలు కల్కి షోలను ఎందుకు క్యాన్సిల్ చేశారు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రేక్షకుల డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? లేదా? అనే విషయంపై ఆందోళన నెలకొంది.

- Advertisement -

Pune Viral Video: Audiences Up In Arms After IMAX Show Of Prabhas, Deepika Padukone's 'Kalki 2898 AD' Cancelled At Westend Mall

అదిరిపోయిన ఆడియన్స్ రెస్పాన్స్

ఇదిలా ఉండగా సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఇంకా అదే ట్రాన్స్ లో ఉంటున్నారు. మొత్తానికి సైలెంట్ గా బాక్స్ ఆఫీస్ సునామీని క్రియేట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి సినిమాలో నటించిన ప్రభాస్ తో పాటు ఒక్కో స్టార్ పాత్ర అద్భుతంగా ఉంది. అలాగే సినిమాలో చూడాల్సిన ఎన్నో సర్ప్రైజ్ లు ఉన్నాయి. గత మూడు నెలలుగా సరైన హిట్ లేక అల్లాడిపోతున్న బాక్స్ ఆఫీస్ దాహం తీర్చే సత్తా ఉన్న సినిమా అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఊపు చూస్తుంటే ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ను  దున్నేయడం ఖాయం అనిపిస్తుంది. మరి కల్కి కలెక్షన్ల పరంగా ఎలాంటి హిస్టరీని క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆర్ఆర్ఆర్ రికార్డును తిరగరాస్తుందా?

కాగా మొదటి రోజే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు కొల్లగొడుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ మొదటి రోజు 200 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి మొదటి స్థానంలో ఉంది. మరి కల్కి ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా? అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకే అందరి చూపూ కల్కి 2898 ఏడీ కలెక్షన్లపైనే ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు