Kalki Vs Adhipurush: మళ్లీ ట్రోల్ కి గురవుతున్న డైరెక్టర్..చీప్ అంటూ కామెంట్స్..!

Kalki Vs Adhipurush.. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. దీపికా పదుకొనె, దిశాపటాని, మాళవికా నాయర్, మృనాల్ ఠాకూర్, శోభన తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD.. అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ , రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని కూడా నటిస్తున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది కానీ ఆయన షూటింగ్ పార్ట్ ను సినిమా నుంచి ఎడిట్ చేసినట్లు సమాచారం. మరొకవైపు రాంగోపాల్ వర్మ , రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు కూడా ఈ సినిమాలో నటించారు..

Kalki Vs Adhipurush: Director getting trolled again..Cheap comments..!
Kalki Vs Adhipurush: Director getting trolled again..Cheap comments..!

రూ.600 కోట్ల బడ్జెట్.. పెట్టిన ప్రతి రూపాయికి విలువ..

పౌరాణిక అంశాలను జోడిస్తూ.. అద్భుతమైన వీ ఎఫ్ ఎక్స్ విజువల్స్ తో రూ.600 కోట్ల బడ్జెట్ తో సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు బడ్జెట్ లో పెట్టిన ప్రతి రూపాయికి విలువ కట్టారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు బడ్జెట్ వృధా అని ఎక్కడ అనిపించలేదు.. సినిమా మొదటి నుంచి క్లైమాక్స్ వరకు చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది.. ఇక ప్రపంచం అధర్మం పాలై అంతం అయ్యేనాటికి చిట్టచివరి ప్రాంతంగా కాశీ పట్టణాన్ని చూపించారు..ఇది కూడా నాశనం అయిపోతే తిరిగి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీమహావిష్ణువు కల్కి అవతారం ఎత్తబోతున్నారు.. ఇలా పురాణాలను కూడా చాలా చక్కగా చూపించారు.. ముఖ్యంగా మహాభారత యుద్ధం తో మొదలుపెట్టిన ఈ సినిమా.. చివరిగా కల్కి అవతరణ రాబోతోంది అంటూ చూపించారు.. ఇక ఈ సినిమా సీక్వెల్ కాకుండా యూనివర్స్ గా రాబోతోందని స్పష్టం చేశారు.. అయితే ఇలాంటి సమయంలో ఆది పురుష్ సినిమాను తెరపైకి తీసుకొస్తూ డైరెక్టర్ ను భారీగా ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం.

కల్కి నీ పొగుడుతూ.. ఓం రౌత్ పై విమర్శలు..

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్.. కృతి సనన్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించిన చిత్రం ఆది పురుష్.. గత ఏడాది విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ ను మూట కట్టుకుంది. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా పూర్తిగా పౌరాణిక కథను తెరకెక్కించడంలో డైరెక్టర్ ఓం రౌత్ విఫలమయ్యారు.. పైగా విఎఫ్ఎక్స్ కూడా అసలు ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పైగా ఈ సినిమా కోసం రూ.700 కోట్ల బడ్జెట్ కేటాయించారు.. అయితే ఇంత ఖర్చు పెట్టి.. వీఎఫ్ఎక్స్ చాలా చీప్ గా ఉపయోగించారు. ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు వీ ఎఫ్ ఎక్స్ ఎలా ఉండాలి.. రూ.600 కోట్ల బడ్జెట్ పెట్టిన కల్కి సినిమా బెస్ట్ ఎగ్జామ్ పుల్ గా చూపిస్తున్నారు. రూ.600 కోట్లు పెడితే సినిమా కల్కి లాగా ఉండాలి.. కానీ ఆది పురుష్ వీఎఫ్ఎక్స్ చాలా చీప్ గా ఉంది.. పైగా పౌరాణిక టచ్ కూడా కల్కి లో ఉన్నంత పద్ధతిగా ఆది పురుష్ చూపించలేదు. ఎంతైనా టాలీవుడ్ డైరెక్టర్ కదా.. అందుకే సినిమాను చాలా గొప్పగా చిత్రీకరించారు అంటూ ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఆది పురుష్ డైరెక్టర్ పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి దీనిపై ఓం రౌత్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు