Kalki 2898AD: ఓటీటీ ప్రియులకు షాక్.. చూడాలంటే అలా చేయాల్సిందే..?

Kalki 2898AD.. మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్, రెబల్ స్టార్ ప్రభాస్ తో కల్కి 2898AD చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ప్రపంచవ్యాప్తంగా రూ .1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు అందుకున్న ఇండియన్ చిత్రంగా కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ ఇతర సినిమా కూడా ఈ మధ్యకాలంలో ఈ రికార్డును అందుకునే అవకాశం కూడా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Kalki 2898AD: A shock for OTT lovers.. Do you have to watch it?
Kalki 2898AD: A shock for OTT lovers.. Do you have to watch it?

ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ఫిలిం గా కల్కి..

ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఖాతాలో అత్యధిక కలెక్షన్లు అందుకున్న చిత్రంగా కల్కి సినిమా నిలిచిపోయింది అంతేకాదు ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ చిత్రంగా కల్కి రావడం నిజంగా విశేషం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు హాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఇలాంటి ఫ్యూచర్స్టిక్ కాన్సెప్ట్ చిత్రాలను ఇండియన్స్ కి కూడా పరిచయం చేశారు నాగ్ అశ్విన్. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిద్ధమయింది. ఇక ఈ ఓటీటీ వెర్షన్ కోసం కొన్ని మార్పులు కూడా చేస్తున్నారు చిత్ర బృందం.

ట్రిమ్ చేయబోతున్న చిత్ర బృందం..

కల్కి థియేట్రికల్ ప్రింట్ ఏకంగా మూడు గంటలు నిడివి ఉంది. సినిమా ఫస్ట్ ఆరంభంలో కొంత అవసరం లేని సన్నివేశాలు ఉన్నాయనే అభిప్రాయం పబ్లిక్ నుంచి వచ్చినా.. ఈ సినిమాకి ఆదరణ మరింత పెరగడంతో.. చిత్ర బృందం మళ్ళీ మార్పులు చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ఓటిటి కోసం కొంత ఎడిట్ చేస్తున్నారని సమాచారం. ఆరంభంలో అవసరం లేని సన్నివేశాలను తొలగించి సినిమా నిడివిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారట.ఇప్పుడు ఈ ట్రిమ్డ్ వెర్షన్ ను ఓటీటి ఆడియన్స్ ముందుకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

రెంటల్ పద్ధతిలో ఓటీటీ లో స్ట్రీమింగ్..

ఈ సినిమాని రెంటల్ పద్ధతిలో ఓటీటీ లోకి తీసుకొస్తున్నారు. ఆగస్టు 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రిమ్ చేసిన మూవీ ని రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొస్తారట. ఫ్రీ స్ట్రీమింగ్ సెప్టెంబర్ నుంచి ఉండవచ్చని అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా సౌత్ భాషలకు సంబంధించి డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. మొత్తానికైతే ఈ సినిమాను ముందుగా చూడాలంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో డబ్బులు చెల్లించక తప్పదు అన్నమాట. మరి ఏ మేరకు ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి.

అంతర్జాతీయ రెస్పాన్స్..

ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాని ఓటీటీలలోకి తీసుకొచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మరి కల్కి డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత ఏ మేరకు రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఇందులో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొని, దిశా పటానీ , కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ లాంటి భారీ తారాగణం నటించిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు