Kalki2898AD : ఇంకా రిలీజే అవ్వలేదు… అప్పుడే RRR క్లోజింగ్ రికార్డ్ బ్రేక్

Kalki2898AD : పాన్ ఇండియా వైడ్ గా ఈ ఏడాది బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది కల్కి2898AD అనే చెప్పాలి. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో సహా, కామన్ ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఓ రెండు మూడు నెలల ముందువరకూ ఈ సినిమాపై పెద్దగా క్రేజ్ లేదు. ఓ కమర్షియల్ సినిమాగానే ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కూడా భావించారు. కానీ కల్కి మేకర్స్ తమ ప్రమోషన్లతో కల్కి పై పాన్ ఇండియా అటెన్షన్ వచ్చేలా చేసారు. ఇప్పటివరకూ కల్కి నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు, అలాగే సినిమా సాంగ్స్ అన్నీ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అంటూ ఆసక్తి పెరిగేలా చేసాయి. ఇదిలా ఉండగా కల్కి ప్రమోషనల్ ఈవెంట్స్ లో మేకర్స్, నటీనటులు సినిమా గురించి మాట్లాడిన తీరు కూడా ఓ రేంజ్ అంచనాలని పెంచేసాయి. ఫైనల్ గా జూన్ 27న అన్ని చోట్ల రికార్డులు కొల్లగొట్టడానికి రెడీ అవుతుంది. అయితే కల్కి (Kalki2898AD) ప్రీమియర్స్ నుండే ఓ రేంజ్ రికార్డులకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే రికార్డుల జాతర సృష్టిస్తుండగా, ఓ దేశంలో అయితే RRR రికార్డులని ఒక్క షో కూడా పడకుండానే బ్రేక్ చేసేసింది.

Kalki2898AD broke RRR movie records in Germany with pre-tickets

 

- Advertisement -

ఆ దేశంలో RRR క్లోజింగ్ రికార్డ్ బ్రేక్… ఇదెక్కడి మాసయ్యా?

ఇక ఇండియా లో ఈ ఇయర్ బిగ్గెస్ట్ రిలీజ్ గా కల్కి నిలవనుండగా, దేశదేశాల్లోనూ కల్కి ప్రభంజనం ఇప్పటికే మొదలైంది. అయితే ఓ దేశంలో బ్లాక్ బస్టర్ RRR మూవీ క్లోజింగ్ రికార్డ్ ని కల్కి ప్రీమియర్స్ బుకింగ్ తోనే బ్రేక్ చేయడా విశేషం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అల్ టైం బిజినెస్ తో పాటు, బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇక ఫస్ట్ డే కూడా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే జర్మనీ దేశంలో RRR మూవీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని కల్కి ఒక్క షో కూడా పడకుండా, కేవలం బుకింగ్స్ తోనే బ్రేక్ చేసి రికార్డు సృష్టించింది. అయితే 2022 టైంలో ఆర్ఆర్ఆర్ మూవీ రన్ కంప్లీట్ అయ్యే టైంకి జర్మనీ కరెన్సీలో దాదాపు 63 వేల యూరోలను కలెక్ట్ చేసింది. ఆ టైం కి అదే హైయెస్ట్ కలెక్షన్స్. ఇక ఇప్పుడు కల్కి మూవీ జర్మనీలో ప్రీ టికెట్ సేల్స్ తోనే ఈ రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇక కల్కి జర్మనీ లో ఇప్పటికే 64 వేలకు పైగా యూరోలను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఒక్క షో పడకముందే ఆర్ఆర్ఆర్ ని బ్రేక్ చేయడం రికార్డ్ అనే చెప్పాలి. మరి ముందు ముందు అక్కడ ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

అల్ టైం రికార్డులపై గురి?

ఇక కల్కి2898AD సినిమా ఫస్ట్ డే ఆర్ఆర్ఆర్ ని బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రీ టికెట్ బుకింగ్స్ ద్వారా 50 కోట్ల వసూళ్ళని దాటేసిన ఈ సినిమా డే 1 కొత్త రికార్డులు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇక కల్కి సినిమా తొలిరోజు దాదాపు 200 నుండి 250 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని సమాచారం. అన్ని కుదిరితే ఓవర్సీస్ సహాయంతో 300 కోట్లు కొట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక కల్కి సినిమాతో ఈసారి ప్రభాస్ 1000 కోట్ల క్లబ్ లో ఈజీగా అడుగుపెట్టేస్తాడని అంటున్నారు. మరి కల్కి రికార్డులు బ్రేక్ అయ్యే ఓపెనింగ్స్ కి ఇంకా ఒక్కరోజే అడ్డు ఉంది. జూన్ 27న ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు