Kalki2898AD : ఇంకా మూడు వారాలు.. అప్పుడే అక్కడ రచ్చ శురూ.. 1.2 కోట్లు ఔట్..

Kalki2898AD : టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా భాషల్లో సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “కల్కి2898AD”. పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898AD ( Kalki2898AD) ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రమోషన్లలో బిజీ అయింది. ఇక మరో 20 రోజుల్లో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అవుతూ ఉంది. ఆల్రెడీ సినిమా మీద ఇప్పటికే ఓ రేంజ్ లో సాలిడ్ క్రేజ్ ఉండగా సలార్ లాంటి మాస్ సబ్జెక్ట్ తర్వాత మైథలాజికల్ టచ్ తో సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో సినిమా వస్తుంది. ఇక కల్కి మూవీ అన్ని భాషల ఆడియన్స్ ను అలరించే అవకాశం ఎంతైనా ఉండగా, సినిమా మీద ఉన్న బజ్ కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. ఇక సినిమా బిజినెస్ కూడా మంచి జోరునే చూపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ కొన్ని చోట్ల ఓపెన్ చేయగా, అక్కడ నుండి బుకింగ్స్ రెస్పాన్స్ సూపర్ సాలిడ్ గా కొనసాగుతూ ఉండటం విశేషమని చెప్పాలి.

Kalki2898AD Collects 150K Dollars in Overseas Advance Bookings

మూడు వారాలు ఉండగానే 1.2 కోట్లు ఔట్..

ఇక ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న కల్కి సినిమా కి సంబంధించి, ఆల్రెడీ జిన్ని రోజుల ముందే సుమారు 125 వరకు లోకేషన్స్ లో సినిమా ప్రీ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. ఇక అక్కడ యావరేజ్ గా టికెట్ కాస్ట్ ఇప్పుడు $33 డాలర్స్ దాకా ఉండగా బుకింగ్స్ ఓపెన్ చేసిన సెంటర్స్ లో మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా $150K మార్క్ ని ఆల్ రెడీ దాటేసి ఫుల్ జోష్ తో దూసుకు పోతుందని సమాచారం. ఆల్ మోస్ట్ 1.2 కోట్లకు పైగా గ్రాస్ రిలీజ్ కి ఇంకా 20 రోజుల ముందుగానే సొంతం చేసుకున్న కల్కి మూవీ ఎలాంటి క్రేజ్ తో రిలీజ్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఫుల్ ఓపెనింగ్స్ కానే లేదు, ఆల్రెడీ కల్కి మూవీ రచ్చ చేయడం స్టార్ట్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సాలిడ్ గా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

- Advertisement -

22 భాషల్లో రీలీజ్.. రికార్డ్ ఓపెనింగ్స్ పై కన్ను..

ఇక కల్కి2898AD సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 22 భాషల్లో రిలీజ్ చేస్తున్నారని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ముందుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ లో ముందుగా రిలీజ్ చేస్తున్నారని టీజర్స్ తో స్పష్టమైంది. అయితే మిగతా భాషల్లో కూడా అదే టైం కి రిలీజ్ చేస్తారా? లేదా టైం తీసుకుంటారా? అనేది తెలియాలి. ఇక కల్కి2898AD సినిమాని ప్రపంచ వ్యక్తంగా అన్ని భాషల్లో కలిపి పదివేల థియేటర్లలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. చూస్తుంటే RRR ఫస్ట్ డే రికార్డులు ఈజీ గా బ్రేక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక కల్కి2898AD లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలు నటించడం వల్ల ఇతర భాషల్లోనూ ఓపెనింగ్స్ భారీగా ఉండనున్నాయి అని తెలుస్తుంది. మరి జూన్ 27న కల్కి ఎలాంటి రికార్డులు కొల్లగొడతాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు