Kalki2898AD: ఆంధ్రాలో కల్కి టికెట్ రేటు భారీగా పెంపు.. ఎంతంటే..?

Kalki2898AD.. టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898AD చిత్రం ఈనెల 27న అంటే రేపటి రోజున విడుదల కాబోతోంది. కల్కి చిత్రం కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమాకి కొన్నేళ్లపాటు కష్టపడుతూనే ఉన్నారు. ఇన్నేళ్ళ కష్టానికి ఒక్కసారిగా కొత్త ప్రపంచాన్ని కూడా సృష్టించారు అని చెప్పవచ్చు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే వంటి సెలెబ్రెటీలు నటించడంతో ఈ సినిమా పైన మరింత బజ్ పెరిగిపోయింది.

టికెట్ రేట్ పెంపుకు ఆమోదం తెలిపిన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు..

Kalki2898AD: Huge increase in Kalki ticket rate in Andhra.. How much..?
Kalki2898AD: Huge increase in Kalki ticket rate in Andhra.. How much..?

ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి సినిమా.. టికెట్ల ధరల విషయంలో కూడా అటు రెండు తెలుగు రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఎక్స్ట్రా షోలకు టికెట్ల రేటు పెంపుకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు పరిమిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం కూడా కల్కి సినిమాకి టికెట్ల రేటు పెంపు విషయంలో పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్కి 2898AD సినిమా టికెట్ల ధర పెంపుతో పాటు అదనపు షోలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినది.

సింగిల్ స్క్రీన్ రూ.75.. మల్టీప్లెక్స్ రూ.125..

ఈనెల 27వ తేదీ నుంచి 14 రోజులపాటు టికెట్ ధరలను పెంచుకునే అందుబాటును కూడా కల్పించింది.. టికెట్లు ధరల పెంపు విషయానికి వస్తే.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు మల్టీప్లెక్స్ థియేటర్లలో 125 రూపాయల వరకు పెంచుకునేలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని నిర్మాత అశ్వినీ దత్ కోరినటువంటి వినతి పత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఐదు రోజులు అదనపు షోలు నిర్వహించే వీలుగా జీవోను కూడా జారీ చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే చాలా రోజుల తర్వాత మళ్లీ థియేటర్లు కళకళలాడబోతున్నాయని చెప్పవచ్చు.

- Advertisement -

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వారే ముఖ్య అతిథులు..

గత వారం రోజులు ముందు నుంచే కల్కి సినిమా హవా చాలా స్పష్టంగా అన్నిచోట్ల కనిపిస్తున్నది.. మరొక పక్క ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఈరోజు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు అతిథులుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , చిరంజీవి వంటి వారు వస్తారా లేదా అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. రీసెంట్గా కల్కి రెండవ ట్రైలర్ చూసి హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఈ సినిమా ఉందనే విషయాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా టైటిల్ కల్కి కాబట్టి ప్రభాస్ చేసే పాత్ర కల్కి అయ్యి ఉంటుందా లేకపోతే కల్కి ఎవరు అనే విషయం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా ప్రభాస్ మరొకసారి భారీ కలెక్షన్లను రాబడతారేమో చూడాలి మరి. ఏది ఏమైనా బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలకు మించి ఈ సినిమా చరిత్ర తిరగరాయబోతోందని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు