Kalki2898AD : కల్కి మాస్ సెన్సేషన్.. బుక్ మై షో లో అల్ టైం రికార్డ్..

Kalki2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ప్రతి ఏరియాలోనూ కళ్ళు చెదిరే రికార్డులు కొల్లగొడుతూ టాప్ లో దూసుకుపోతుంది. విడుదలైన పదకొండు రోజుల్లో కల్కి సినిమా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ నుండే సెన్సేషన్ సృష్టిస్తుండగా, తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కాగా, భారీ ప్రాఫిట్స్ దిశగా కల్కి దూసుకుపోతుంది. ప్రభాస్ తో సహా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉండడం వల్ల అన్ని ఏరియాల్లో కూడా భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఇక కల్కి మూవీసైన్స్ ఫిక్షన్ జోనర్ లో హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కడం వల్ల ఓవర్సీస్ లో, అమెరికన్లు కూడా ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో తాజాగా కల్కి 16 మిల్లియన్ల డాలర్ల దాకా వసూలు చేయగా, ఇరవై మిలియన్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది.

Kalki2898AD Movie creates history with 1crore ticket sales on Book My Show

బుక్ మై షో లో కల్కి భారీ రికార్డ్…

ఇక తాజాగా కల్కి సినిమా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. బుక్ మై షో ద్వారా కల్కి సినిమాకి సంబంధించి ఏకంగా ఒక కోటి టికెట్లు సేల్ అయ్యాయట. ఈ విషయాన్నీ బుక్ మై షో ఫ్లాట్ ఫామ్ వారు ప్రకటించారు. అంతే కాకుండా బుక్ మై షో లో ఇప్పటివరకు జరిగిన టికెట్ సేల్స్ లో హైయెస్ట్ సేల్స్ కల్కి సినిమాకే జరిగాయట. ఇక కల్కి సినిమాకి వారం ముందు నుండే మూవీ లవర్స్ భారీగా ఎదురుచూడడం జరిగింది. ఈరోజుల్లో డైరెక్ట్ గా థియేటర్లకు వెళ్లి జనాలు టికెట్లు క్యూ లో కొనడం తగ్గించారు. అందువల్ల ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ కి గిరాకి పెరిగింది. దాంతో కల్కి కి ఇంత తొందరగా ఈ రికార్డు వచ్చిందని చెప్పొచ్చు.

- Advertisement -

వెయ్యి కోట్ల దిశగా..

ఇక కల్కి (Kalki2898AD) సినిమా థియేట్రికల్ కలెక్షన్ల పరంగా భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ ముందుకు వెళ్తుంది.ఇప్పటికే ఓవర్సీస్ లో వంద కోట్ల షేర్ వసూలు చేయగా, తాజాగా హిందీ వెర్షన్ వసూళ్లు 200 కోట్లు దాటిపోయాయి. అలాగే అన్ని ఏరియాల్లో కూడా ప్రాఫిట్స్ ని తెచ్చుకోగా, లాంగ్ రన్ లో వంద కోట్లకి పైగా లాభాన్ని సాధించే దిశగా దూసుకుపోతుంది. ఇక ఇండియన్2 సినిమా ప్రభావం పెద్దగా లేకపోతే, ఈజీగా వెయ్యి కోట్ల క్లబ్ లో తొందరగా చేరిపోతుందని చెప్పొచ్చు. ఇక కల్కి పార్ట్ 2 వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు