Kalki2898AD : కల్కిపై ఆ విషయంలో పెరుగుతున్న నెగిటివిటి… దీనిపై నాగ్ అశ్విన్ వివరణ ఇవ్వలేదేం?

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన పాన్ ఇండియా నటులు నటించడం వల్ల, భారీ ఓపెనింగ్స్ దక్కింది. కల్కిలో ప్రభాస్ తో సహా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు. అయితే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మైథలాజి టచ్ ఇవ్వడం పట్ల కామన్ ఆడియన్స్ లో కూడా మంచి ఆసక్తి వచ్చింది. థియేటర్లలో ఇప్పటికే 700 కోట్ల వసూళ్లు క్రాస్ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది. అయితే ఈ సినీమాలో పురాణాలకి సంబంధించి మహాభారత యుద్ధానికి సంబంధించిన కృష్ణార్జునులు, అలాగే అశ్వద్ధామ, కర్ణ పాత్రలని కూడా చూపించడం జరిగింది. కానీ ఇందులో మహాభారతంలో ఉన్నట్టుగా కర్ణుడిని, అర్జునుడిని చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడని ఆడియన్స్ లో ఒక వర్గం నుండి టాక్ వస్తుంది. దీనిపై రోజురోజుకి నెగిటివీటి పెరిగిపోతుంది.

Kalki2898AD movie gets more negativity on social media

కల్కి పై పెరుగుతున్న నెగిటివిటి

అయితే కల్కి సినిమా వచ్చినప్పటి పాజిటివ్ గా థియేటర్లలో రన్ అవుతున్నా, సినిమాపై నెగిటివిటి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మహాభారతంలో ముఖ్య పాత్రలైన కృష్ణార్జునులు, అశ్వద్ధామ, కర్ణ పాత్రలను నెగిటివ్ గా చుపించారని పలువురు ప్రముఖులు విమర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా కల్కి లో ఇతిహాసాలలో మహావీరుల పాత్రలని ఈ వక్రీకరించారని, చిత్ర యూనిట్ చాలా పెద్ద తప్పు చేసారని విమర్శించారు. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ప్రముఖ అధ్యాత్మిక వేత్త అయిన రాధా మనోహర్ దాస్ కల్కి మేకర్స్ పై విరుచుకుపడ్డారు. మహాభారతంలో దిక్కుమాలిన సలహాలు ఇవ్వడంలో, నోటి దూల లో, మోసాలు చేయడంలో ముందుండే కర్ణుడి పాత్రని ఈ సినిమాలో పాజిటివ్ గా చూపించారని, చిత్ర యూనిట్ పై ప్రేక్షకులు ప్రశ్నించరేమి అని కల్కి మేకర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై నెగిటివిటి పెరుగుతుంది.

- Advertisement -

నాగ్ అశ్విన్.. దీనిపై వివరణ ఎప్పుడు?

అయితే చిత్ర యూనిట్ నిర్మాతలుగాని, దర్శకుడు నాగ్ అశ్విన్ (Kalki2898AD) గాని దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. చిత్ర దర్శకుడు సినిమా రిలీజ్ అయిన వారం తరవాత ప్రెస్ మీట్ పెట్టగా, అందులో వివిధ అంశాలపై నాగ్ అశ్విన్ ప్రస్తావించాడు. కానీ కల్కి లో మహాభారతం సన్నివేశాలపై వస్తున్న ఈ నెగిటివిటీని ప్రస్తావించలేదు. ఈ నెగిటివిటి ఎక్కువైతే కల్కి కి లాంగ్ రన్ దక్కడం కష్టం. పైగా రెండో పార్ట్ పై ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా కల్కి పై వస్తున్న ఈ నెగిటివీటి కి నాగ్ అశ్విన్ రియాక్ట్ అయితే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు