Kalki2898AD : రేట్లు తగ్గాయి… ఈసారి కామన్ ఆడియన్స్ వంతు..

Kalki2898AD : ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా కల్కి2898AD సినిమా ట్రెండ్ నడుస్తుంది. మూవీ లవర్స్ నుండి ఎక్కడ సినిమా టాపిక్ మాట్లాడినా, అది కల్కి గురించే అవుతుంది. ఇక ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదలై వరల్డ్ వైడ్ గా అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణం నటించడంతో అన్ని భాషల్లో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేస్తుండగా, ప్రీమియర్స్ నుండే రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తుంది. ఇదిలా ఉండగా కల్కి సినిమా ఇప్పటివరకు 800 కోట్ల కలెక్షన్లు వసూలు వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది. పైగా కల్కి సైన్స్ ఫిక్షన్ జోనర్ లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కడం వల్ల ఓవర్సీస్ లో భారీ కల్లెక్షన్లు కొల్లగొడుతూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే అక్కడ 15 మిలియన్ డాలర్లు క్రాస్ చేయగా 20 మిలియన్ల డాలర్ల దిశగా దూసుకుపోతుంది.

Kalki2898AD movie latest collections update

రేట్లు నార్మల్ అయ్యాయి..

అయితే కల్కి (Kalki2898AD) సినిమాకి ఉన్న హైప్ వల్ల యూత్ ఆడియన్స్ ఎగబడి టికెట్లు కొన్నారు. పాన్ ఇండియా రేంజ్ నటుల వల్ల, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ వల్ల భారీ టికెట్ రేట్లు ఉన్నా సాలిడ్ ఓపెనింగ్స్ దక్కాయి. అయితే ఇప్పుడు తొలివారం పూర్తయ్యాక కూడా అదే రేటు పెడితే, అసలు వచ్చే జనాలు కూడా రారు. అందుకే తొలివారం పూర్తి కాగానే టికెట్ రేట్లు నార్మల్ చేసేసారు చిత్ర యూనిట్. థియేటర్లలో సింగిల్ స్క్రీన్ లో 150 చేయగా, మల్టిప్లెక్స్ లో 300 చేసారు. ఇక టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని వెనుకంజ వేసిన సాధారణ ప్రేక్షకులంతా, ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గడంతో థియేటర్లకు వస్తున్నారు.

- Advertisement -

ఇప్పుడు కామన్ ఆడియన్స్ వంతు..

ఇకపోతే హై టికెట్ రేట్ల వల్ల థియేటర్లకు రాని కామన్ ఆడియన్స్, రెండో వారం రేట్లు తగ్గడంతో, ఈ వీకెండ్లో ఫ్యామిలీతో సినిమా చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పైగా ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అనే టాక్ రావడంతో ‘కల్కి’ని చూడడానికి కామన్ ఆడియన్స్ థియేటర్లలో ఫ్యామిలీతో చూడడానికి వస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఓపెనింగ్స్ విషయంలో ఫ్యాన్స్ చూసుకోగా, ఇప్పుడు లాంగ్ రన్ ఆడించే బాధ్యత కామన్ ఆడియన్స్ తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా అభిమానులు ఓపెనింగ్స్ వరకే ఉంటారు. ఆ తర్వాత సినిమాని డిసైడ్ చేసేది కామన్ ఆడియన్సే. ఇక ఈ రెండో వీకెండ్ లో కల్కి ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు